Vastu Tips: ఇంట్లో ఉంచే ఈ వస్తువులు వ్యక్తి దారిద్య్రానికి కారణమవుతాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!

|

May 02, 2022 | 5:50 AM

Vastu Tips: వాస్తు ప్రకారం నిర్మించిన, వస్తువులు ఏర్పాటు చేసిన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. ఆ ఇంట్లోని కుటుంబం పురోగమిస్తుంది. కుటుంబ సభ్యులలో ప్రేమ,..

Vastu Tips: ఇంట్లో ఉంచే ఈ వస్తువులు వ్యక్తి దారిద్య్రానికి కారణమవుతాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!
Vastu
Follow us on

Vastu Tips: వాస్తు ప్రకారం నిర్మించిన, వస్తువులు ఏర్పాటు చేసిన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. ఆ ఇంట్లోని కుటుంబం పురోగమిస్తుంది. కుటుంబ సభ్యులలో ప్రేమ, సామరస్యం నెలకొంటాయి. అదే సమయంలో వాస్తు దోషం ఉంటే.. అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో ఘర్షణలు తలెత్తుతాయి. దరిద్రం వెంటాడుతుంది. లక్ష్మీ దేవి ఇంటిని వీడి వెళ్లిపోతుంది. అందుకే.. ఇంటి విషయంలో దిక్కులతో పాటు.. వాస్తు అంశాలన్నింటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇంట్లో ఉంచుకునే కొన్ని వస్తువులు కూడా కుటుంబ పురోగతికి ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు వాస్తు పండితులు. అలాంటి వస్తువులను ఇంట్లో నుంచి తొలగించాలని చెబుతున్నారు. మరి ఇంట్లోంచి బయట పడేయాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వస్తువులను ఇంట్లో నుంచి బయట పడేయండి..
1. వాస్తు శాస్త్రం ప్రకారం, నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదట. దీని వల్ల ఇంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయట.
2. వాస్తు శాస్త్రం ప్రకారం యుద్ధ చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. ఈ చిత్రాలు కుటుంబ సభ్యులపై చెడు ప్రభావం చూపుతాయని చెబుతున్నారు
3. ముళ్ల మొక్కలను ఇంట్లో ఎప్పుడూ నాటకూడదు. వాస్తు శాస్త్రంలో గులాబీలు తప్ప మిగిలిన ముళ్ల మొక్కలను అశుభకరమైనవిగా పరిగణిస్తారు. ఇంట్లో ముళ్ల చెట్లు ఉండటం వల్ల నెగటీవ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
4. మునిగిపోతున్న ఓడల చిత్రాలు, వేట చిత్రాలు, కత్తి యుద్ధాల చిత్రాలు, పట్టుబడిన ఏనుగుల చిత్రాలు, ఇంట్లో ఏడుస్తున్న వ్యక్తుల చిత్రాలు ఉంచడం దోషపూరితంగా పేర్కొంటారు. దీని కారణంగా ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది.
5. అస్తమిస్తున్న సూర్యుని బొమ్మను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కుటుంబ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. వాస్తు శాస్త్రంలో ఉదయించే సూర్యుని చిత్రాన్ని కలిగి ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

(గమనిక: ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని హిందూ మత గ్రంధాలు, వేదపండితులు అందించిన సమాచారం మేరకు పబ్లి్ష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు.)

Also read:

Child care tip: వేసవిలో పిల్లల శరీరం చల్లగా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి..!

Viral Video: ఒక్క నీటి చుక్క నిండు ప్రాణాలను కాపాడింది.. గుండెను పిండేస్తున్న వీడియో..!

Trs vs Bjp: బండి సంజయ్‌కి నిజంగా ప్రేమ ఉంటే ఆ పని చేయాలి.. మంత్రి కేటీఆర్ డిమాండ్..