Vastu Tips: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా.. ఈ వస్తువును ఇంటికి తీసుకురండి

|

Dec 02, 2023 | 9:46 PM

వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణంలో ఏదైనా తప్పు జరిగితే అది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఇంటి దిశను సరిచేయడానికి కొన్ని ప్రత్యేక విషయాలు ఉపయోగకరంగా పరిగణించబడతాయి. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లయితే  ఖచ్చితంగా ఈ వస్తువులలో కొన్నింటిని ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన ఆర్థిక స్థితి మెరుగు అవుతుంది. 

Vastu Tips: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా.. ఈ వస్తువును ఇంటికి తీసుకురండి
Vastu Tips
Follow us on

వాస్తు శాస్త్రంలో శుభా అశుభాలను కలుగు జేసే శక్తికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో సానుకూల శక్తి,  ప్రతికూల శక్తిపై ఆధారపడి  ఆనందం, సుఖ సంపదలు, ఆధారపడి ఉంటాయని విశ్వాసం. అయితే ఇంట్లోని  ప్రతికూల శక్తి జీవితంలో అనేక సమస్యలను తెస్తుంది. వాస్తు శాస్త్రంలో దిక్కులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో బెడ్ రూమ్, కిచెన్, బాత్రూమ్, మెట్లు , ఇంటి కిటికీల ఏర్పాటుకు నిర్దిష్ట దిశ పేర్కొంది.

వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణంలో ఏదైనా తప్పు జరిగితే అది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఇంటి దిశను సరిచేయడానికి కొన్ని ప్రత్యేక విషయాలు ఉపయోగకరంగా పరిగణించబడతాయి. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లయితే  ఖచ్చితంగా ఈ వస్తువులలో కొన్నింటిని ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన ఆర్థిక స్థితి మెరుగు అవుతుంది.

ఇంటిలోనికి వీటిల్లో దేనినైనా తీసుకురండి

  1. ఇంట్లో సానుకూల శక్తి కొనసాగించడానికి పంచముఖి హనుమంతుని విగ్రహం లేదా ఫోటోను ఇంట్లో ఏర్పాటు చేసుకోండి. అయితే ఈ ఫోటోను ఇంటికి నైరుతి దిశలో ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటి ఆర్థిక స్థితి బలపడుతుంది.
  2. వాస్తు శాస్త్రంలో పిరమిడ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాస్తు దోషం ఉన్న ఇంటి దిశలో పిరమిడ్ ఉంచడం వల్ల అభివృద్ది కలుగుతుందని నమ్మకం. ఇంటికి వెండి, ఇత్తడి లేదా రాగి పిరమిడ్ తీసుకురండి. వాస్తుకు సంబంధించిన ఈ వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఇంటి సభ్యులందరూ కలిసి కూర్చునే ప్రదేశంలో ఉంచండి.
  3. ఇవి కూడా చదవండి
  4. పూజ గదిలో లక్ష్మీ దేవి పద్మ చిహ్నాన్ని, కుబేరుడి చిత్రాన్ని ఉంచండి. లక్ష్మీదేవి సంపదకు దేవత.  కుబేరుడు కూడా సంపద దేవుడు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రవేశద్వారం వద్ద లక్ష్మీ-కుబేరుల చిత్రాన్ని కూడా ఉంచాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి.
  5. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నీటితో నిండిన పాత్రను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటి ఉత్తరం వైపు ఉంచాలి. నీళ్లతో నింపిన పాత్రలో పువ్వుల్ని వేసి ఉంచాలి.
  6. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు ఉంచడం కూడా అదృష్టాన్ని తెస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు