Vastu Tips: ఇంటి చుట్టూ పచ్చని చెట్లు ఉండే.. ఆ ఇంట్లోని వారు ఆయురారోగ్యాలతో జీవించగలుగుతారు. పైగా ఆకుపచ్చ రంగు లాభాలకు, శ్రేయస్సుకు చిహ్నం కూడా. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన గాలితో పాటు అనేక సానుకూల ఫలితాలు కూడా లభిస్తాయి. అయితే కొన్ని రకాల మొక్కలు ఇంటికి పేదరికాన్ని, దరిద్ర దేవతను ఆహ్వానిస్తాయి. ఇంటిని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నాశనం చేస్తాయి. అందుకే వాస్తుకి విరుద్ధమైన కొన్ని మొక్కలను ఇంటి ఆవరణలో నాటవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అసలు ఇంటి ఆవరణలో ఉండకూడని మొక్కలు, అందుకు కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటి ఆవరణలో ఉండకూడని మొక్కలివే..
ముళ్ల మొక్కలు: వాస్తు శాస్త్రం ప్రకారం ముళ్ళ మొక్కలు ఇంటి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు. ఉదాహరణకు గులాబీ, కాక్టస్, నిమ్మ వంటి మొక్కలను ఎప్పుడూ ఇంటి ముందు లేదా ఇంటి లోపల నాటకూడదు. ముల్లు ద్వేషం, కలహాలకు చిహ్నం. ఇలాంటి మొక్కలను నాటడం వల్ల కుటుంబంలో మనస్పర్థలు, కలహాలు వచ్చి కుటుంబమే నాశనం అవుతుందన్నారు. కాబట్టి, ఇంటి ముందు అలాంటి మొక్కలను నాటడం మానుకోండి.
చింతచెట్టు: వాస్తు శాస్త్రం ప్రకారం కుటుంబ సభ్యులు నివసించే ఇంటి దగ్గర చింత చెట్టు ఎప్పుడూ ఉండకూడదు. చింతపండు ఇంటి సభ్యుల మధ్య విభేదాలను పెంచుతుంది. శత్రుత్వం తరచుగా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి ఇంటి ముందు చింతచెట్టును నాటకండి.
ఖర్జూరం: ఖర్జూరం ఆరోగ్యానికి మంచిది. అయినప్పటికీ భారతీయ సంస్కృతిలో ఇది చాలా చెడు ప్రభావాలకు సంకేత మొక్కగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం ఖర్జూర చెట్టును ఇంటి ముందు నాటడం వల్ల కుటుంబానికి చెడ్డ రోజులు వస్తాయి. కుటుంబీకులకు తరచూ ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి, ఖర్జూరం నాటాలని కలలో కూడా అనుకోకండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి