Vastu Tips: సనాతన హిందూ ధర్మంలో పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూజ మానసిక ప్రశాంతతతో పాటు సుఖశాంతులను ప్రసాదిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే పూజ కోసం నిర్మించిన గదిలో వాస్తు నియమాలు పాటించడం చాలా ముఖ్యం. వాస్తు వాస్తు విషయంలో ఏ చిన్న దోషం జరిగినా దాని పర్యవసనాలను పూర్తి కుటుంబం అనుభవించాల్సి వస్తుందని శాస్త్ర పండితులు చెబుతుంటారు. ఈ దోషాల కారణంగానే కొందరు నిత్యం పూజలు చేసినా వారిని అర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ సమస్యల నంచి బయటపడేందుకు పూజగది వాస్తులో భాగంగా కొన్ని వస్తువులను తప్పనిసరిగా పెట్టుకోవాలి. పూజగదిలో ఆయా వస్తువులు ఉండే కుటుంబంలో ఆయురారోగ్యాలు, సిరిసంపదలు లభిస్తాయని పెద్దల విశ్వాసం.
గంట: ఇష్ట దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు, పూజ ఉత్తమ మార్గాలు. ఈ క్రమంలో చాలా మంది పూజనే ఎంచుకుంటారు. ఈ క్రమంలో గంట మ్రోగిస్తూ పూజ చేయడం వల్ల ఇంట్లో సానుకూలత ఏర్పడడంతో పాటు దుష్టశక్తులు ఇంటి నుంచి దూరంగా పోతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా అర్థిక, ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయంట.
నెమలి ఈక: శ్రీకృష్ణుడి అలంకరణలో భాగమైన నెమలి ఈకకు మన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. వెన్నె దొంగకు ఇష్టమైన నెమలి ఈక పూజ గదిలో ఉండే ఆనందం పెరిగి అర్థికంగా స్థిరపడతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
దీపం: ఎలాంటి పూజ అయినా దీపం లేకుంటే అది అసంపూర్ణమే. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదికి పశ్చిమాన దీపం పెట్టడం అత్యంత శుభప్రదం. పడమర దిక్కున దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని, ఫలితంగా సానుకూల శక్తి, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం.
శంఖం: పూజ గదిలో శంఖాన్ని ఉంచడం ఎంతో శుభప్రదమైనదని పెద్దలు చెబుతుంటారు. ఇలా పూజగదిలో శంఖం ఉంటే.. సుఖసంతోషాలు, సిరిసంపదలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
కలశం: దైవ ప్రతిమల ముందు పూజ చేసే సమయంలో నీరు నింపిన కలశం ఉంచితే ఇంట్లో ఆర్థిక సమస్యలు లేని ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెబుతుంటారు. ఎందుకంటే కలశం స్వయంగా విఘ్నేశ్వరుడికి ప్రతీకగా భావిస్తుంటారు.
గంగా జలం: హిందూ ధర్మంలో గంగా జలం ఎంతో పవిత్రమైనది. ఈ జలాన్ని పూజ గదిలో ఇత్తడి లేదా వెండి పాత్రలలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని పెద్దల నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..