Snakes: పాము ఇలా కనిపిస్తే శుభమా అశుభమా..? మీ జీవితం గురించి పాములు తెలిపే రహస్య సంకేతాలివి..
పాములు ఎవరికైనా కంటపడితే కొందరు భయంతో పరుగందుకుంటారు. మరికొందరు చేతులెత్తి దండం పెడతారు. పాములు కంటికి కనిపించడం ఇంటి ఆవరణలోకి రావడం వంటివి వాస్తు, జ్యోతిష్య శాస్త్రంలో అనేక సంకేతాలకు చిహ్నంగా తెలుపుతారు. పాములకు మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యం ఉందని ఇవి మన జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతాయట. ఎలాంటి పాములు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి..

పాము పేరు వింటేనే భయపడతారు. కానీ అప్పుడప్పుడు పాములు ఇంట్లోకి రావడం, ఇంటి చుట్టుపక్కల కనిపించడం చూస్తుంటాం. వీటిని కొందరు అకారణంగా చంపేస్తుంటారు. వాటి వల్ల లేనిపోని దోషాలు చుట్టుకుంటాయని కొందరి విశ్వాసం. పాములు ఇంట్లోకి రావడం, కంటికి కనిపించడం అశుభానికి చిహ్నంగా భావిస్తారు. మరికొందరు దీనిని దేవతగా భావించి పూజలు చేస్తుంటారు. అసలింతకీ పాములు ఇళ్లలోకి రావడం వెనుక ఏదైనా కారణం ఉందా? ఇవి మన భవిష్యత్తు గురించి ఏదైనా విషయాన్ని చెప్తాయా అనే సందేహాలు చాలా మందికి ఉంటుంది. అయితే ఇవి ఇంట్లో కనిపించడం శుభమా లేక అశుభమా? అనే విషయాలు తెలుసుకుందాం..
నల్లపాము..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇంట్లో నల్ల పాము కనిపిస్తే, అది శుభ సంకేతంగా చూస్తారు. ఇవి ఎవ్వరికీ ఎలాంటి హాని చేయని సందర్భంలో వీటిని ఏమీ చేయకుండా వదిలేయడమే మంచిదంటారు.
గోధుమ రంగు పాము
గోధుమ రంగు పాము ఇంట్లోకి వచ్చినట్ట మీరు త్వరలోనే పరమ శివుని ఆశీస్సులు పొందుతారని, విజయంతో పాటుగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని చెబుతారు.
జంట పాములు..
కొన్ని సార్లు నలుపు, గోధుమ రంగు పాములు కలగలిసి కనిపిస్తుంటాయి. ఇవి దంపతుల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుదలను సూచిస్తుంది. ఇది కాకుండా, ఇది ఆ ఇంటికి సంతాన భాగ్యాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.
తెల్లపాము..
ఇంట్లో తెల్ల పాము కనిపిస్తే, మీ అదృష్టం వెల్లివిరుస్తుందని సూచిస్తుంది. కానీ తెల్ల పాము ఇంట్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
వెండి వర్ణం..
తెల్లటి వెండి వర్ణం గల పాము మీ ఇంటి ఆవరణలో గానీ ఇంట్లోకి గానీ వస్తే మీపై డబ్బు వర్షం కురుస్తుందని, మీ ఆనందం శ్రేయస్సు పెరుగుతుందని సూచిస్తుంది.
పసుపు రంగు..
పసుపు పాము ఇంట్లో పసుపు పాము కనిపిస్తే, అది మీ జీవితంలో పురోగతిని సూచిస్తుంది. తొందర్లోనే జీవితంలో ఎదుగుతారని దీనికి సంకేతం.
ఆకుపచ్చ..
ఇంట్లో ఆకుపచ్చ పాము కనిపిస్తే, జీవితంలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని సూచిస్తుంది. త్వరలోనే మీకు మనశ్శాంతి కలిగి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని అర్థం.