AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఆర్ధిక ఇబ్బందులా.. ఇంట్లో ఏ దిశలో ఏనుగు విగ్రహాన్ని ఉంచితే శుభఫలితం కలుగుతుందంటే..

హిందూ విశ్వాసాల ప్రకారం ఏనుగు గణేశుడి రూపంగా పరిగణించబడుతుంది. గణేశుడిని గజముఖుడి అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఏనుగు ఇంద్రదేవుని వాహనం.  అయితే ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని లేదా ఏనుగు బొమ్మను ఏ దిక్కున పెడితే మీకు అదృష్టాన్ని తెస్తుందో ఈరోజు తెలుసుకుందాం.. 

Vastu Tips: ఆర్ధిక ఇబ్బందులా.. ఇంట్లో ఏ దిశలో ఏనుగు విగ్రహాన్ని ఉంచితే శుభఫలితం కలుగుతుందంటే..
Vastu Tips For Elephant Statue
Surya Kala
|

Updated on: Nov 04, 2022 | 4:01 PM

Share

వాస్తు శాస్త్రం ఇంట్లో శాంతి, ప్రశాంతత ఎల్లప్పుడూ ఉండే విధంగా వాస్తు దోషాన్ని తొలగించడానికి వివిధ చర్యలను నిర్దేశించింది. వాస్తు శాస్త్ర గ్రంధాలలో, ఏనుగుకి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఏనుగు సహనానికి కారకంగా వర్ణించబడింది. ఏనుగు లక్ష్మీదేవికి సంబంధించినది. హిందూ మతంలో, వెండితో చేసిన విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మతంలోనే కాదు, వాస్తు , ఫెంగ్ షుయ్ శాస్త్రంలో కూడా ఏనుగు విగ్రహం, పెయింటింగ్ లేదా చిత్రాన్ని కలిగి ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసాల ప్రకారం ఏనుగు గణేశుడి రూపంగా పరిగణించబడుతుంది. గణేశుడిని గజముఖుడి అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఏనుగు ఇంద్రదేవుని వాహనం.  అయితే ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని లేదా ఏనుగు బొమ్మను ఏ దిక్కున పెడితే మీకు అదృష్టాన్ని తెస్తుందో ఈరోజు తెలుసుకుందాం..

  1. ఏనుగు విగ్రహం ప్రాముఖ్యత గ్రంధాలలో చాలా సార్లు ప్రస్తావించబడింది. ఏనుగు గణేశుడి రూపంగా పరిగణించబడుతుంది. సంపద దేవత లక్ష్మి అష్ట రూపాల్లో ఒకటి గజలక్ష్మి.. ఇంట్లో ఏనుగు విగ్రహం ఉండటం చాలా శుభప్రదం. ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. ఇంట్లో కొన్ని దిశలో వెండి ఏనుగును ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. వాస్తు దోషాలు తొలగి జీవితంలో పురోభివృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవి, గణపతి  అనుగ్రహంతో వ్యాపారంలో లాభం, ఉద్యోగంలో పురోగతి సిద్ధిస్తుంది.
  2. ఏనుగు విగ్రహాన్ని ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలంటే: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉత్తర దిశలో వెండితో చేసిన ఏనుగును ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో సుఖ సంపదను పెరుగుతాయని నమ్మకం. విగ్రహం లేకపోయినా ఉత్తర దిశలో ఏనుగు చిత్రాన్ని కూడా ఉంచవచ్చు.
  3. ఉత్తర దిశలో ఒక జత ఏనుగులను ఉంచడం వల్ల సానుకూల శక్తి , సంపద ప్రయోజనాలు లభిస్తాయి.
  4. పిల్లలకు చదువుపై ఆసక్తి లేకపోతే ఏనుగు విగ్రహాన్ని స్టడీ రూమ్‌లో ఉంచాలి. దీంతో పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఏనుగు విగ్రహం ఉన్న చోట రాహు గ్రహం ప్రభావం చూపదని నమ్మకం.
  7. ఇంట్లో ఆర్ధిక, డబ్బు సంబంధిత సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది.  కాబట్టి ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదం, ప్రయోజనకరమైనదిగా పరిగణింపబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)