Vastu Tips: ఇంట్లో సుఖ సంపదలు ఎల్లపుడూ ఉండాలంటే పూజగది విషయంలో ఈ టిప్స్ పాటించండి

|

Mar 23, 2022 | 10:28 AM

Vastu Tips: వాస్తు శాస్త్రంలో.. ఇంట్లో పెట్టుకునే వస్తువులకు, వాటిని ఇంట్లో ఉంచే దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ( Vastu Tips ). వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు..

Vastu Tips: ఇంట్లో సుఖ సంపదలు ఎల్లపుడూ ఉండాలంటే పూజగది విషయంలో ఈ టిప్స్ పాటించండి
Vastu Tips
Follow us on

Vastu Tips: వాస్తు శాస్త్రంలో.. ఇంట్లో పెట్టుకునే వస్తువులకు, వాటిని ఇంట్లో ఉంచే దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ( Vastu Tips ). వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు ఆ ఇంట్లో మంచి చెడులను కలిగించే శక్తి ఉంటుంది. వ్యక్తిపై సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే.. చేపట్టిన పని పూర్తి అయ్యే సమయంలో చివరకు విఫలమవుతుందని నమ్ముతారు. కనుక ఇంటి వాస్తు దోషాన్ని తొలగించడానికి కొన్ని వాస్తు నివారణలను సూచిస్తారు. చాలా సార్లు ఇంట్లో ఎంత డబ్బు వచ్చినా నిలవదు. దీనికి కారణం ఇంట్లోని వాస్తు దోషం కూడా కారణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో.. ఇళ్ళు ఏ దిక్కున ఉండాలి, పూజ గదిలో ఏ వస్తువులు ఉంచడం వలన సుఖసంపదలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఇంట్లో పూజ గది నిర్మాణం: 
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ గది నిర్మాణానికి సరైన దిక్కు ఈశాన్య దిక్కు. ఈ దిశ పూజగదికి  ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దిశలో దేవుడి గదిని నిర్మిస్తే.. ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. పొరపాటున కూడా దక్షిణ దిశలో పూజ గదిని  నిర్మించకూడదు. ఈ దిక్కులో పూజ గది ఉంటె ధన నష్టం జరిగే అవకాశం ఉంటుందని నమ్ముతారు.

దేవుడి పూజ గదిలో ఉంచాల్సిన వస్తువులు: 
నెమలి ఈక: 
శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. దీన్ని పూజ గదిలో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పూజా స్థలంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు.

శంఖం: 
ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజా మందిరంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని నమ్మకం. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు ఉంటాయి.

గంగాజలం: 
హిందూ మతంలో పవిత్ర గంగా నది నీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గంగపవిత్ర జలం ఎప్పుడూ చెడిపోదని నమ్ముతారు. పూజా స్థలంలో పవిత్ర జలాన్ని ఉంచడం వలన లక్ష్మీదేవి సంతోషముగా ఉంటుందని ఇంటికి సిరి సంపదలు ఇస్తుందని నమ్మకం.

శాలిగ్రామం
శాలిగ్రామం విష్ణువు రూపంగా పరిగణించబడుతుంది. శాలిగ్రామ స్వామిని పూజా స్థలంలో ఉంచడం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని నమ్మకం.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Former MLA: రెండేళ్ల తర్వాత కూతురు స్కూల్‌కి వెళ్తుంటే.. కొత్తకారులో బ్యాండ్ బాజాలతో సాగనంపిన తండ్రి ప్రేమ