ప్రతి స్త్రీ జీవితంలో వివాహం ఒక మలుపు. కొత్త ఇల్లు, కొత్త సభ్యులు, సంప్రదాయాలకు అలవాటు అవ్వడానికి.. పరిస్థితికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడానికి సమయం పడుతుంది. వివాహం తర్వాత తన ఇంటి అభివృద్ధి కోసం స్త్రీ కొన్ని సంప్రదాయాలను పాటించాలి. అవును ఈ సంప్రదాయం ప్రకారం వివాహం తర్వాత.. కొన్ని రకాల వస్తువులను పుట్టింటి నుంచి తన ఇంటికి తీసుకెళ్లకూడదు. ఒకవేళ తెలిసి తెలియక కొన్నింటిని పొరపాటున తీసుకెళ్తే.. ఇంట్లో కష్టాలు కలగవచ్చు. అంతేకాదు భార్యాభర్తల మధ్య విభేదాలు తరచుగా ఏర్పడి.. సంబంధాలలో చీలికలకు కారణమవుతాయి. అలాగే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని, ఇంట్లో డబ్బులకు కొరత ఉంటుందని వాస్తు శాస్త్రం పేర్కొంది.
దేవుని విగ్రహం: వివాహం తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి అత్తారింటికి దేవుని విగ్రహాన్ని లేదా చిత్ర పటాలను తీసుకెళ్లకూడదు. ఇలా ఎవరైనా తమ పుట్టింటి ఇంటి నుంచి దేవుడి విగ్రహాన్ని తెచ్చుకుంటే, .. పుట్టి పెరిగిన ఇంట్లో పేదరికం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దురదృష్టం ఎదురవుతాయని అంటారు.
చెడు పరిస్థితులు: ప్రతి ఇంట్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. అయితే పుట్టింట్లో చెడు సంఘటనల గురించి భర్త ఇంట్లో పంచుకోకూడదు. మీరు పుట్టింటికి ఇంటికి వెళ్ళినప్పుడు. ఇంట్లో పరిస్థితులను చెప్పినా.. వాటిని అక్కడే వదిలేయాలి. పుట్టింట్లో కష్టాలు, చెడు విషయాలను అత్తారింట్లో చెప్పడం వలన పుట్టింటి వారు లోకువ అవుతారు. ఇలాంటి గుణం లక్ష్మీదేవికి నచ్చదని నమ్మకం.
పదునైన వస్తువులు: అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకెళ్లకూడదు. ఇలాంటి వస్తువులను అత్తారింటికి తీసుకుని వెళ్ళడం వల్ల ఇంట్లో వాదనలు, విభేదాలు తలెత్తుతాయి. ఒకొక్కసారి వివాహంలో విభేదాలు ఏర్పడి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు కలుగవచ్చు. పుట్టిన ఇంటికి.. అత్తారింటికి ఇంటికి మధ్య సంబంధం చెడిపోతుంది.
డబ్బు: వివాహం తర్వాత.. వివాహితస్త్రీ తన పుట్టింటి నుంచి అత్తారింటికి పదే పదే డబ్బు తీసుకెళ్లకూడదు. ముఖ్యంగా భర్త చెప్పాడంటూ కూతురు తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి మరీ డబ్బు తీసుకుంటే.. ఈ చర్య ఆమె అత్తారింటిని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇల్లు నాశనం అవుతుంది. ఎంత కష్టపడి పనిచేసినా.. డబ్బు ఎప్పుడూ ఇంట్లో ఉండదు. ఆర్థిక సమస్యలు వస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు