అప్పుల బాధతో తిప్పలు పడుతున్నారా.. మనీ ప్లాంట్ దగ్గర ఈ చిన్న మార్పులు చేస్తే డబ్బే డబ్బు..

Money Plant: మనీ ప్లాంట్ అనేది కేవలం ఇంటి అందాన్ని పెంచే అలంకరణ మొక్క మాత్రమే కాదు.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అపారమైన సంపదకు, సానుకూల శక్తికి మూలం. అయితే చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్ ఉన్నా.. ఆశించిన ఆర్థిక ఫలితాలు రావు. దానికి కారణం సరైన వాస్తు నియమాలు పాటించకపోవడమే.. అందుకే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

అప్పుల బాధతో తిప్పలు పడుతున్నారా.. మనీ ప్లాంట్ దగ్గర ఈ చిన్న మార్పులు చేస్తే డబ్బే డబ్బు..
Vastu Tips For Money Plant

Updated on: Feb 21, 2026 | 1:56 PM

మన ఇళ్లలో సాధారణంగా కనిపించే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. ఇది కేవలం ఇంటి అందాన్ని పెంచే మొక్క మాత్రమే కాదు.. వాస్తు శాస్త్రం ప్రకారం సంపద, శ్రేయస్సు, సానుకూల శక్తిని ఆకర్షించే ఒక గొప్ప సాధనం. మనీ ప్లాంట్ ఆరోగ్యంగా, పచ్చగా ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతుంటారు. అయితే మనీ ప్లాంట్ నుంచి పూర్తి ఫలితాలు పొందాలంటే కొన్ని ప్రత్యేకమైన వాస్తు చిట్కాలు పాటించాలని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలతో పెరుగుదల.. ఆర్థిక స్థిరత్వం

మనీ ప్లాంట్ పెరిగే మట్టిలో కొద్దిగా పాలు కలపడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. పాలు స్వచ్ఛతకు, శ్రేయస్సుకు చిహ్నం. ఇలా చేయడం వల్ల మొక్క వేగంగా పెరగడమే కాకుండా ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం నిలుస్తుందని, అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం.

పంచదారతో తీపి లాభాలు

మొక్క మొదట్లో కొంచెం చక్కెర కలపడం వల్ల ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. వాస్తు ప్రకారం చక్కెర ఇంట్లో సంతోషాన్ని, సంపద పెరుగుదలను సూచిస్తుంది. అంతేకాకుండా ఇది జాతకంలోని రాహు దోష ప్రభావాలను తగ్గించి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

దిశ చాలా ముఖ్యం

మనీ ప్లాంట్‌ను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈ మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. ఈ దిశలు కుబేరుడికి, సూర్యుడికి సంబంధించినవి కావడంతో సంపద ప్రవాహం పెరుగుతుంది.

మరికొన్ని శక్తివంతమైన చిట్కాలు..

  • మొక్క చుట్టూ ఒక చిన్న దండ కట్టడం వల్ల దాని శక్తి పెరుగుతుందని, తద్వారా ఇంట్లో నిరంతరం ధన ప్రవాహం ఉంటుందని చెబుతారు.
  • మొక్క దగ్గర చిన్న తెల్లని పూసలు లేదా స్ఫటికాలను ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం మెరుగుపడుతుంది.
  • మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ పైకి వెళ్లేలా చూడాలి. అవి నేలను తాకితే ఆర్థిక పతనాన్ని సూచిస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(గమనిక: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9 ధృవీకరించడం లేదు.)

Follow Us