Vastu Tips: ఇంట్లో తాళం చెవి ఎక్కడ బడితే అక్కడ పెడుతున్నారా.. ఏ దిశలో పెట్టాలి? ఏ దిశలో పెట్టకూడదు తెలుసుకోండి..

|

Oct 15, 2024 | 6:29 PM

వాస్తు ప్రకారం ఇంటి తాళం చెవిని కూడా ఉంచడానికి సరైన స్థలం ఉంది. అదే సముయంలో ఇంట్లో తాళం, తాళం చెవిని ఉంచకూడని ప్రదేశాలు ఉన్నాయి. వీటిని పాటించక ఎక్కడ బడితే అక్కడ తాళం చెవిని పెట్టడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రోజు వాస్తు ప్రకారం తాళం చెవిని ఎక్కడ పెట్టాలి .. ఎక్కడ పెట్టకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

Vastu Tips: ఇంట్లో తాళం చెవి ఎక్కడ బడితే అక్కడ పెడుతున్నారా.. ఏ దిశలో పెట్టాలి? ఏ దిశలో పెట్టకూడదు తెలుసుకోండి..
Vastu Tips For Home
Follow us on

ప్రతి వ్యక్తి జీవితంలో వాస్తు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం కొన్ని విషయాలు పాటిస్తే జీవితంలోని అనేక సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముతారు. ఏదైనా కొత్త విషయాన్ని అవలంబిస్తున్నప్పుడు వాస్తును దృష్టిలో ఉంచుకుంటారు. అదేవిధంగా వాస్తు ప్రకారం ఇంటిని అలంకరిచుకున్నా.. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నా అది శుభాలను చేకూరుస్తుందని నమ్మకం.

ఇంట్లో తాళాలు ఎక్కడ ఉంచకూడదంటే

తమ ఇంటి తాళాలను సురక్షితంగా ఉంచడానికి ప్రజలు చాలా ప్రదేశాలను ఉపయోగిస్తారు. అయితే తాళం పెట్టె సమయంలో వాస్తుపై శ్రద్ధ పెట్టడం మరచిపోతారు. దీని కారణంగా వారు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీకు కూడా ఇంట్లో ఎక్కడ బడితే అక్కడ తాళం చెవి ఉంచడం అలవాటు ఉంటె.. ఆ అలవాటుని వెంటనే మార్చుకోండి. లేకుంటే దీని పర్యవసానాలను అనుభవించాల్సి రావచ్చు.

పూజ గదిలో తాళంచెవి ఉంచరాదు

తాళాలు పోతాయని లేదా తాళం పెట్టిన చోటుని మరచిపోతామని భయంతో ప్రజలు వాటిని ప్రత్యేక ప్రదేశాల్లో ఉంచడం చాలాసార్లు కనిపిస్తుంది. కొందరు పూజా స్థలంలో తాళం పెడతారు. అయితే తాళం చెవిని పూజా స్థలంలోనూ ఉంచకూడదని వాస్తు చెబుతోంది. ఇలా చేయడం సరైనది కాదు. పూజ గది సానుకూల శక్తిపై ప్రభావం చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

తాళాలు బ్రహ్మ స్థానంలో ఉంచకూడదు.

ఇంటిలోని బ్రహ్మస్థానంలో తాళంచెవులు పెట్టుకోరాదు. ఈ ప్రదేశంలో పొరపాటున అయినా తాళం చెవులను ఇనుమతో చేస్తారు కనుక ఇలా పెట్టడం వలన ప్రతికూలత వ్యాపిస్తుంది. ఇలా చేయడం వలన ఇంటిలో అడ్డంకులను సృష్టించుకున్నట్లే..

ఈశాన్య దిశలో తాళం చెవిని ఉంచవద్దు.

ఈశాన్య మూల అనేది ఇంటి ముఖ్యమైన మూలల్లో ఒకటి. ఈ దిశ చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణించబడుతుంది. ఇంటిలోని ఈశాన్య మూల ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కనుక లోహ వస్తువువైన తాళం చెవులను పొరపాటున కూడా ఈశాన్య దిశలో పెట్టుకోకూడదు.

ఇంట్లో కీలను ఎక్కడ ఉంచాలంటే

తాళం చెవులను ఇంట్లో కొన్ని చోట్ల పెట్టడం వలన లాభదాయకంగా ఉంటుంది లేదా లాభదాయకంగా లేకపోయినా కనీసం నష్టం జరగదు. తాళం లోహంతో తయారు చేస్తారు.

కీని వాయువ్య దిశలో ఉంచండి

ఎవరి వద్ద అయినా ఇల్లు, ఆఫీసు, కారు, లాకర్ వంటి రకరకాల తాళాలు ఉంటాయి. ఈ కీలను జాగ్రత్తగా ఉంచడం ముఖ్యం. ఎందుకంటే ఇవి పోగొట్టుకునే చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో తాళం చెవులను ఇంట్లో వాయువ్య దిశలో ఉంచడం శుభప్రదం.

సురక్షితంగా కీని ఎక్కడ ఉంచాలంటే

తాళం చెవులను జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది డబ్బుకు సంబంధించినది. కనుక వాస్తు ప్రకారం సేఫ్ కీలను జాగ్రత్తగా ఉంచాలి. భద్రతా కోణంలో చూస్తే ఇంటి ముఖ్యమైన తాళాలను ఎక్కడ పెట్టారో తప్పని సరిగా గోప్యత పాటించాలి. కనుక సేఫ్ కీని నైరుతి దిశలో ఉంచాలి. ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఎల్లప్పుడూ ఒక వ్యక్తి జీవితంపై ప్రభావం చూపిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)