Vastu Tips: ఈ వస్తువులను ఇతరుల నుంచి తెచ్చుకుంటే ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం..

|

Dec 04, 2024 | 1:26 PM

వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణం గురించి మాత్రమే కాదు ఇంట్లో పెట్టుకునే వస్తువుల గురించి.. వేరే వ్యక్తుల నుంచి తెచ్చుకునే వస్తువుల గురించి పేర్కొంది. వేరొకరి ఇంటి నుంచి కొన్ని వస్తువులను తీసుకురావడం అశుభం. ఇతరుల ఇళ్ల నుంచి ఫర్నీచర్, బూట్లు, గొడుగులు తీసుకురావడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని చెబుతారు. దీంతో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Vastu Tips: ఈ వస్తువులను ఇతరుల నుంచి తెచ్చుకుంటే ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం..
Vastu Tips For Home
Follow us on

మనిషి సంఘ జీవి. సమాజంలో ప్రతి ఒక్కరితో కలిసి మెలసి మెలగాల్సి ఉంటుంది. అంతేకాదు తన దైనందిన జీవితంలో పరిచయస్తులతో అనేక విషయాలను పంచుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో కొని సార్లు కొన్ని రకాల వస్తువులను ఇచ్చి పుచ్సుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని వస్తువులను ఇతరుల ఇంటి నుంచి తీసుకురాకూడదు. ఎందుకంటే ఇతరుల ఇంటి నుంచి తెచ్చుకునే ఈ వస్తువులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉపయోగించే వస్తువులు అతని శక్తిపై ప్రభావం చూపుతాయి. వస్తువుల యాజమాని మారడం వలన వాటి శక్తి కూడా మారుతుంది. కనుక నెగెటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్న వస్తువులను పొరపాటున కూడా ఇతరుల దగ్గర నుంచి తీసుకోవద్దు.

ఫర్నిచర్ తీసుకురావద్దు: కొంత మంది పాత ఫర్నీచర్ ను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి ఫర్నీచర్‌తో పాటు నెగెటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి వచ్చి వాస్తు దోషాలను కలిగిస్తుంది. పాత సామాను ఇంటికి తీసుకురావడం అంటే పేదరికానికి ఆహ్వాహనం పలికినట్లే.. సంతోషకరమైన కుటుంబాన్ని నాశనం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

చెప్పులు: ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి అక్కడ ఉన్నవారి చెప్పులు ధరిస్తారు. అయితే అలా చేయకూడదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. శరీరంలోని ప్రతికూల శక్తికి మొదటి స్థానం పాదాలు అని చెబుతున్నారు. కనుక ఇతరుల బూట్లు, చెప్పులు ధరించినప్పుడు.. ప్రతికూలత మీ శరీరంలోకి ప్రవేశించి మిమ్మల్ని కలవరపెడుతుంది.

గొడుగు: వేరొకరి ఇంటి నుంచి గొడుగుని తీసుకోవడం కూడా శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వల్ల గ్రహాల స్థితి క్షీణిస్తుంది. వేరే వాళ్ల ఇంటి నుంచి ఏదో ఒక కారణంతో గొడుగు తీసుకురావాల్సి వచ్చినా.. అవసరం తీరిన వెంటనే తిరిగి ఇవ్వండి.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.