వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టడం వలన ఆ ఇంటిలో ఉండే మనుషుల మంచి చెడులు ఉంటాయని నమ్మికం. అంతేకాదు ఇంట్లోని వస్తువుల అమరికలో కూడా వాస్తు ప్రకారం ఉండడం మంచిది అని విశ్వాసం. ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందులను తొలగించడానికి ఏర్పాటు చేసే వస్తువుల విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందం కోసం కొంతమంది, అదృష్టం కోసం కొంతమంది లక్కి ప్లాంట్, ఫేంగ్ షుయ్ వంటి రకరకాల వస్తువులను ఇంట్లో పెట్టుకుంటారు. ఇలా వీటిని పెట్టుకోవడం వలన ఇంట్లోని నెగెటివిటీ తొలగి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారని విశ్వాసం. ఈ రోజు ఏ వస్తువులను ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం..
లక్కీ ప్లాంట్: ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా అందం కోసం రకరకాల మొక్కలను పెంచుకుంటారు. అలాంటి మొక్కలో లక్కీ ప్లాంట్ ఒకటి. ఈ లక్కీ బ్యాంబో ప్లాంట్ ను చాలామంది ఇంటిలో పెట్టుకుంటున్నారు. అయితే ఈ మొక్కను వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. లక్కీ బ్యాంబో ప్లాంట్ ను తూర్పు లేదా ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఎటువంటి
సమస్యలు తలెత్తవు. ఇంటికి శుభప్రదం చేకూరుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తవు.
పిరమిడ్: ఇంట్లో ఫెంగ్ షుయ్ పిరమిడ్ ను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. దీనిని ఇంటి మధ్య భాగంలో ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. సుఖశాంతులు వెళ్లి విరుస్తాయి. ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. పిరమిడ్ అంటేనే బలానికి స్థిరత్వానికి ప్రతీక. కనుక ఫెంగ్ షుయ్ పిరమిడ్ ను ఇంటి మధ్యలో పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
విండ్ చైమ్: ఇంట్లో విండ్ చైమ్ ఏర్పాటు చేసుకోవడం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ విండ్ చైమ్ నుంచి వచ్చే చిరు సవ్వడి వీనుల విందుగా ఉండి మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. మన ఇంటి వాతావరణంలో నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. వాస్తు ప్రకారం విండ్ చైమ్స్ సక్సెస్ కు, సంతోషానికి సుభానికి గుర్తు.
తాబేలు: తాబేలుని ఏర్పాటు చేసుకోవడం వలన ఇంట్లోని ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారని విశ్వాసం. తాబేలుని స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. దీనిని ఇంట్లో ఏ రూపంలోనైనా ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవడం శుభప్రదం. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారి ప్రయత్నాలు ఫలించి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
లాఫింగ్ బుద్ధ: ఇంట్లో లాఫింగ్ బుద్ధను పెట్టుకోవడానికి ప్రస్తుతం ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారు. దీనినిని ఇంట్లో ఏర్పాటు పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయని నమ్మకం. దీనిని ఇంట్లోని లివింగ్ రూమ్ లో ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం వలన శుభప్రదం. ఈ గదిలో ఎక్కువ సమయం గడుపుతారు కనుక లాఫింగ్ బుద్ధ ను ఇంటి హాల్లో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వలన ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయని విశ్వాసం.
డ్రాగన్ టార్టిల్: తాబేలు డ్రాగన్ కలగలిపి కనిపించే ఈ డ్రాగన్ తాబేలుని వాస్తు ప్రకారం ఇంట్లో ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలి. డ్రాగన్ తాబేలు ధనకర్షణ శక్తిని కలిగి ఉంటుందని విశ్వాసం. కనుక ఈ దిశలో డ్రాగన్ తాబేలుని ఏర్పాటు చేసుకోవడం వలన ఇంట్లోని కుటుంబ సభ్యులు డబ్బుల కొరతను ఎదుర్కోరు. అదృష్టాన్ని ఇస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు