Vastu Tips: ఇతరులకు చెందిన ఈ 6 వస్తువులను అస్సలు వాడొద్దు.. ఎందుకో తెలుసా?

|

Apr 24, 2022 | 5:39 PM

వాస్తు ప్రకారం, ఇతరులకు సంబంధించిన కొన్ని వస్తువులను ఉపయోగించడం ద్వారా ప్రతికూల శక్తి మనలో ఏర్పడుతుందని చెబుతోంది. ఈ చిన్న విషయాలు మీకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.

Vastu Tips: ఇతరులకు చెందిన ఈ 6 వస్తువులను అస్సలు వాడొద్దు.. ఎందుకో తెలుసా?
Vastu Tips
Follow us on

పెద్దలు మనకు ఎన్నో విషయాలు చెబుతుంటారు. ఇంట్లో వాస్తు నుంచి, ప్రయాణాలు, ఎప్పుడు ఎలాంటి కార్యాలు మొదలుపెట్టాలో.. ఇలా ఎన్నో విషయాలు మనకు పెద్దలు చెబుతుంటారు. వారి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఇతరులకు సంబంధించిన కొన్ని వస్తువులను వాడొద్దంటూ పెద్దలు తరచుగా హెచ్చరిస్తుండడం వినే ఉంటాం. ఇక వాస్తు శాస్త్రంలో కూడా ఇలాంటివే కొన్ని కనిపిస్తుంటాయి. వాస్తు(Vastu Tips) ప్రకారం, ఇతరులకు సంబంధించిన కొన్ని వస్తువులను ఉపయోగించడం ద్వారా ప్రతికూల శక్తి మనలో ఏర్పడుతుందని చెబుతోంది. ఈ చిన్న విషయాలు మీకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువులను మనం ఎందుకో ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

రుమాలు – వాస్తు శాస్త్రం ప్రకారం, రుమాలు మరొకరికి దగ్గరగా ఉంచడం వల్ల సంబంధాలలో చీలిక వస్తుంది. మనుషుల మధ్య జరిగే తగాదాలకూ, గొడవలకూ కనెక్ట్ చేసి చూస్తారు. మనం ఎప్పుడూ మరొకరి రుమాలు మన దగ్గర ఉంచుకోకూడదు.

గడియారం – వాస్తు శాస్త్రంలో, గడియారాన్ని సానుకూల, ప్రతికూల శక్తితో అనుసంధానించి చూస్తుంటారు. మణికట్టుపై మరొకరి గడియారాన్ని ధరించడం చాలా అశుభం. ఇలా చేయడం వల్ల మనిషికి చెడుకాలం మొదలవుతుందని అంటారు.

ఉంగరం – వాస్తు శాస్త్రంలో, మరొకరి ఉంగరాన్ని ధరించడం కూడా అశుభం. ఇలా చేయడం వల్ల మనిషి ఆరోగ్యం, జీవితం, ఆర్థిక రంగంపై చెడు ప్రభావం పడుతుంది.

పెన్ – వాస్తు శాస్త్రం ప్రకారం, మనం ఎప్పుడూ మరొకరి కలాన్ని మన దగ్గర ఉంచుకోకూడదు. ఇది కెరీర్ పరంగా అశుభకరమైనదిగా మారుతుందని సూచిస్తుంది. అలాగే డబ్బును కూడా కోల్పోవచ్చని చెబుతోంది.

దుస్తులు – వాస్తు ప్రకారం, మనం ఎప్పుడూ ఇతరుల దుస్తులు ధరించకూడదు. దీని వల్ల మనలో నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించి జీవితంలో అనేక రకాల కష్టాలు రావడం మొదలవుతాయి.

మరిన్ని వాస్తు టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Chanakya Niti: సమాజంలో గౌరవ మర్యాదల పొందాలంటే.. ఎటువంటి వ్యక్తులతో ఎలా నడుచుకోలో చెప్పిన చాణక్య

Zodiac Sign: ఈ రాశి అమ్మాయిలను వివాహం చేసుకున్నవారు అదృష్టాన్ని సొంతం చేసుకున్నట్లే.. అభివృద్ధిని సాధిస్తారు…