ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కల కల. చిన్నదో పెద్దదో సొంత ఇల్లు అంటూ ఉండాలని కోరుకుంటారు. అందుకనే ఎంత కష్టపడి అయినా సరే చాలా మంది సొంత ఇంటి కలను నేరవేర్చుకుంటారు.
కొత్త ఇంటిలో గృహ ప్రవేశాన్ని కూడా ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అయితే ఈ గృహ ప్రవేశం వాస్తు ప్రకారం ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడించారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అందమైన కల. ఈ సమయం ఏ వ్యక్తి జీవితంలోనైనా చాలా విలువైన, మరపురాని క్షణం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని.. ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. అయితే కాలంలో వచ్చిన మార్పులతో ఆధునికత పేరుతో కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చాలా మంది వాస్తు నియమాలను పాటించకపోవడం చాలా తరచుగా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు ఆ కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతాయి. త్వరలో కొత్త ఇంటిలో గృహ ప్రవేశం అవ్వడానికి సిద్ధమవుతున్నట్లయితే.. ఈ 5 ముఖ్యమైన వాస్తు నియమాలను గుర్తుంచుకోండి..
ప్రధాన ద్వారం దిశ ఎంపిక: వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ఈశాన్య దిశలో ఉండాలి. ఇది ప్రధాన ద్వారానికి శుభ దిశగా పరిగణించబడుతుంది. అందుకే వీలైతే ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉండేలా చూసుకోండి. ఇది సాధ్యం కాకపోతే మెయిన్ దొర తలుపు తూర్పు దిక్కున ఉండేలా చూసుకోవాలి.
గృహ ప్రవేశానికి అనుకూలమైన సమయం: కొత్త ఇంట్లో అడుగు పెట్టడానికి తగిన తేదీ, శుభ ముహర్తాన్ని ఎంచుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ల పక్షంలోని గురువారం, శుక్రవారం లేదా ఆదివారం గృహ ప్రవేశం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే గృహ ప్రవేశానికి సంబంధించిన శుభ సమయం కోసం తెలిసిన జ్యోతిష్యుడిని సంప్రదించాలి.
గృహ ప్రవేశంలో సత్యనారాయణ స్వామి వ్రత ప్రాముఖ్యత: కొత్త ఇంట్లో మాత్రమే కాదు ఇంటిలో దేవుడి ఆరాధన ఎల్లప్పుడూ సానుకూల శక్తిని నింపుతుంది. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే ముందు వినాయకుడి పూజ చేయాల్సిందే. అంతేకాదు గృహ ప్రవేశం అనంతరం సత్యనారాయణ స్వామీ వ్రతాన్ని కుటుంబ సభ్యులు అత్యంత భక్తీ శ్రద్దలతో నిర్వహిస్తారు. ఇలా చేయడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ప్రతికూల శక్తి తొలగుతుందని విశ్వాసం. ఇంట్లో ఆనందం, శాంతి కోసం కొత్త ఇంట్లో అడుగు పెట్టే సమయంలో తప్పనిసరిగా వ్రతం నిర్వహించాలి.
వాస్తు దోషాల తొలగింపు: కొత్త ఇంట్లోకి అడుగు పెట్టే ముందు తప్పని సరిగా వాస్తు దోషం ఉందొ లేదో చెక్ చేసుకోవాలి. ఇందు కోసం వాస్తు నిపుణుడి సలహా తీసుకోవాలి. ఏమైనా లోపాలు ఉంటే పరిహారాలతో వాటిని తొలగించుకోవాలి. ఇలా చేయడం వలన భవిష్యత్ లో రానున్న సమస్యలను తగ్గిస్తుంది.
ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోండి: కొత్త ఇంటిని మాత్రమే కాదు అసలు ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరిసంపదలు ఉంటాయని.. అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. వాస్తు ప్రకారం కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు ఇంటిని ఎల్లప్పుడూ చక్కగా అందంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు