వాస్తు: ఇంట్లోని ఈ ప్రదేశాలలో అద్దాలు ఉంచకూడదు, అలా చేస్తే చిక్కులే!

ప్రతి ఇంట్లో అద్దాలు ఉండటం సహజమే. అయితే, వాటిని అమర్చేటప్పుడు సరైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. పెద్ద అద్దాలను ఇంట్లో ఏర్పాటు చేయడం వల్ల నివాసానికి మరింత అందం చేకూరుతుంది. అద్దాలను సరైన ప్రదేశాల్లో ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అయితే, తప్పు చోట్ల అమర్చితే అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

వాస్తు: ఇంట్లోని ఈ ప్రదేశాలలో అద్దాలు ఉంచకూడదు, అలా చేస్తే చిక్కులే!
Mirror

Updated on: Jan 05, 2026 | 10:40 AM

ప్రతి ఇంట్లో అద్దాలు(Mirrors/Glasses) ఉండటం సాధారణమే విషయమే. అయితే, అద్దాలను అమర్చుకునేటప్పుడు.. వాటిని సరైన స్థలంలో ఉంచడం ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతోంది. పెద్ద పెద్ద అద్దాలు నివాసంలో అమర్చుకోవడం వల్ల ఇంటి అందం మరింతగా పెరుగుతుంది. సరైన చోట్ల అద్దాలను అమర్చడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. లేదంటే అనుకోని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ ప్రదేశాలలో అద్దాలను అమర్చడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది.

1. ప్రధాన ద్వారం
ప్రధాన ద్వారం ముందు అద్దాలను ఉపయోగించడం ప్రతికూలంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే.. ఇంట్లోని సానుకూల శక్తి అక్కడికి తిరిగి వెళుతుందని, దీని వల్ల ఇంట్లో శాంతి, శ్రేయస్సు లోపిస్తుందని నమ్ముతారు.

2. మెట్ల కింద
మెట్ల కింద అద్దాలను ఉపయోగించడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే.. ఇది అశాంతిని, శక్తి అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది సానుకూల వాతావరణాన్ని పాడు చేస్తుంది.

3. పూజా మందిరం
దేవతలు, దేవతల విగ్రహాల ప్రతిబింబం అద్దంలో ప్రతిబింబిస్తే ప్రతికూల శక్తి వస్తుందని నమ్ముతారు. అందుకే పూజా గదులలో అద్దాలను ఉపయోగించకూడదు.

4. బాత్రూం

బాత్రూంలో అద్దాల వాడకం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే.. అద్దాలు ఇక్కడ పెడితే ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయని అంటారు. ఇది శరీరం, మనస్సు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

5. వంట గది

వంట గదిలో అద్దాల వాడకం కూడా ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలా చేయడం వల్ల సంపద, శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది కుటుంబ ఆర్థిక స్థితిని ప్రభావం చేస్తుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు.

6. బెడ్ రూమ్

ఇక, బెడ్ రూంలో కూడా అద్దాలను ఉపయోగించడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది మనస్సులో ప్రతికూల ఆలోచనలను పెంచుతుంది. ఇది మానసిక ఇబ్బందులు, నిద్రకు ఆటంకాలు కలిగిస్తుంది.

Note: ఈ వార్తలోని సమాచారం వాస్తుశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తిమేరకు అందించడం జరిగింది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.