Tirumala Rush: తిరుమల క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు.. ఏర్పాట్లపై అసంతృప్తి.. మహాద్వారం వద్ద ఆందోళన

|

Jan 14, 2022 | 1:33 PM

Tirumala Darshana Rush: వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ సంఖ్యలో..

Tirumala Rush: తిరుమల క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు.. ఏర్పాట్లపై అసంతృప్తి.. మహాద్వారం వద్ద ఆందోళన
Tirumala Rush
Follow us on

Tirumala Darshana Rush: వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. దీంతో స్వామివారి దర్శనానికి ఆలస్యం అవుతుందని.. తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం ముందు భక్తులు ధర్నా చేశారు. వెంకన్న దర్శనం చాలా ఆలస్యం అవుతుందని.. భక్తులు(devotees) ఆందోళన చేశారు. ఏకాదశి ఏర్పాట్లపై శ్రీవారి భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. ముఖ్యమంత్రి, చైర్మన్, అదనపు ఈఓ ధర్మారెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. క్యూ లైన్ లో కూర్చున్నారు. దీంతో భక్తుల దగ్గరకు చేరుకున్న తిరుమల విజీఓ బాలరెడ్డి భక్తులకు సర్దిచెప్పారు. దీంతో భక్తులు ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.

ముక్కొటి ఏకాదశి పర్వదినంరోజున వైకుంఠ ద్వారంనుంచి స్వామివారిని దర్శిస్తే.. సకల సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. టిటిడీ కూడా స్వామివారి దర్శనం కోసం సర్వదర్శన టికెట్స్ తో పాటు.. స్పెషల్ టోకెన్లను కూడా జారీ చేసింది. దీంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం తిరుమలకు హాజరయ్యారు. సామాన్య భక్తులను క్యూ లైన్స్ పట్టించుకోవడం లేదని.. ఈవో, ఆదనపు ఈవో వైఖరిని నిరసించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి చిన్నపిల్లలతో కంపార్ట్ మెంట్ లోనే ఉండిపోయామని రాత్రి 8 గంటలవుతున్నా స్వామి దర్శనం భాగ్యం కల్పించలేదని భక్తులు మండిపడ్డారు. దీంతో స్వామి వారి ఆలయం మహాద్వారం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో బైటాయించి ఆందోళనకు దిగారు.

 

Also Read:

సంక్రాంతి స్పెషల్ ఫుడ్.. అమ్మమ్మ కాలం నాటి అరిసెలు తయారీ.. ఆరోగ్య ప్రయోజనాలు..