వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకుని కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం పోటెత్తుతోంది. ఎటుచూసినా ఎక్కడ చూసినా భక్తులే. కొండ పైనా-కిందా ఒకటే రద్దీ. రేపట్నుంచి (శనివారం) వైకుంఠ ద్వార దర్శనం ఉండటంలో టోకెన్ల కోసం పోటెత్తుతున్నారు భక్తులు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం శుక్రవారం నుంచే క్యూలైన్లలో పడిగాపులు పడుతున్నారు భక్తులు.
అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో షెడ్యూల్ కంటే ముందే టోకెన్ల జారీ చేయడం మొదలుపెట్టింది టీటీడీ. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ మధ్యాహ్నం నుంచి టికెట్లు జారీ చేయాల్సి ఉండగా… భక్తుల రద్దీతో అర్థరాత్రి నుంచే టోకెన్లు ఇస్తోంది. ఒక్క తిరుపతిలోనే 90కి పైగా కౌంటర్ల ద్వారా టికెట్లు ఇష్యూ చేస్తోంది టీటీడీ.
ఇప్పటికే రెండు లక్షల 25 వేల టికెట్లు, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేసింది టీటీడీ. ప్రస్తుతం 4,25,500 టోకె టోకెన్లను ఆఫ్‌లైన్‌లో కౌంటర్ల ద్వారా ఇష్యూ చేస్తోంది. టోకెన్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుండటంతో టికెట్ల కోసం పోటీపడుతున్నారు భక్తులు.
మరోవైపు, తిరుమల శ్రీవారి దర్శనానికి 16గంటలకు పైగా టైమ్ పడుతోంది. నిన్న ఒక్కరోజే సుమారు 60వేల మంది దర్శించుకోగా, ప్రస్తుతం అంతకుమించి భక్తులు దర్శనం వెయిట్ చేస్తున్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ నిండి కిక్కిరిసిపోయాయి.
మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ వెలుగులోకి రావడమే కాదు.. కొన్ని రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్న వేళ టీటీడీ ముందే అప్రత్తమైంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లను జారీ చేస్తున్న కేంద్రాల వద్ద టీటీడీ కౌంటర్లలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సిందిగా భక్తులకు సూచిస్తుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ కేంద్రాల వద్ద కోవిడ్ జాగ్రత్తలపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అప్రమత్తం చేస్తోంది. భక్తులకు నో మాస్క్ నో ఎంట్రీ, క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించాలనే సూచనలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులు వస్తున్న నేపథ్యంలో టిటిడి అప్రమత్తమైంది. అయినప్పటికీ భక్తులు మాత్రం ఎటువంటి కరోనా నిబంధనలు పాటించడం లేదు. పైగా టికెట్స్ కోసం పోటీపడుతున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు.. మాస్క్ లు ధరించడకుండానే టోకెన్లు కోసం క్యూ లైన్ ల్లో భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం 25 వ తేదీ నాటికి సర్వదర్శనం టోకెన్లు టిటిడి జారీ చేస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..