Sri Vaidyanatha Ashtakam: రోజూ 3సార్లు పఠిస్తే ఆరోగ్యసమస్యలను తీర్చే వైద్యనాథాష్టకం.. మహిమాన్విత్వం

|

Feb 24, 2021 | 10:50 AM

బాలాంబిక పతి... జరామరణముల భయమును పోగొట్టేవాడు వైద్యనాథుడు. అటువంటి వైధ్యానాథుని స్మరిస్తూ.. వైద్యనాథాష్టకం ప్రతి దినము మూడు సార్లు పఠించే వారికి ఆరోగ్యం కలుగుతుందట.. అంతటి మహిమాన్వితమైన..

Sri Vaidyanatha Ashtakam: రోజూ 3సార్లు పఠిస్తే ఆరోగ్యసమస్యలను తీర్చే వైద్యనాథాష్టకం.. మహిమాన్విత్వం
Follow us on

Sri Vaidyanatha Ashtakam : బాలాంబిక పతి… జరామరణముల భయమును పోగొట్టేవాడు వైద్యనాథుడు. అటువంటి వైధ్యానాథుని స్మరిస్తూ.. వైద్యనాథాష్టకం ప్రతి దినము మూడు సార్లు పఠించే వారికి ఆరోగ్యం కలుగుతుందట.. అంతటి మహిమాన్వితమైన వైథ్యనాథ అష్టకం… తాత్పర్యం.. ఫల శృతి… మీకోసం..!!

శ్రీ రామసౌమిత్రి జటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ |
శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||
గంగాప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహంత్రే |
సమస్త దేవైరభిపూజితాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||
భక్తఃప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్టహరాయ నిత్యమ్ |
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||
ప్రభూతవాతాది సమస్తరోగ ప్రనాశకర్త్రే మునివందితాయ |
ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీనజంతోః వాక్శ్రోత్రనేత్రాంఘ్రిసుఖప్రదాయ |
కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||
వేదాంతవేద్యాయ జగన్మయాయ యోగీశ్వరధ్యేయపదాంబుజాయ |
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||
స్వతీర్థ మృద్భస్మ భృతాంగభాజాం పిశాచ దుఃఖార్తి భయాపహాయ |
ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ స్రక్గంధ భస్మాద్యభి శోభితాయ |
సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||

తాత్పర్యము:

శ్రీ రాముడు, లక్ష్మణుడు, జటాయువు, వేదములు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు, అంగారకుడిచే పూజించబడిన, నీలకంఠము కలవాడు, దయామయుడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
ప్రవహించే గంగను, చంద్రుని జటా ఝూటములో ధరించిన, మూడు కన్నులు కలవాడు, మన్మథుని, యముని సంహరించిన వాడు, దేవతలందరి చేత పూజించ బడినవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
భక్త ప్రియుడు, త్రిపురములను నాశనము చేసిన వాడు, పినాకమును (త్రిశూలమును) చేతిలో ధరించిన వాడు, నిత్యము దుష్టులను సంహరించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
వాతము, కీళ్ళనొప్పులు మొదలగు రోగములను నాశనము చేసే వాడు, మునులచే పూజించబడిన వాడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములుగా కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
వాక్కు, వినికిడి శక్తి, కాంతి చూపు, నడిచే శక్తి కోల్పోయిన జీవ రాశులకు ఆ శక్తులను తిరిగి కలిపించే వాడు, కుష్ఠు మొదలగు భయంకరమైన రోగములను నిర్మూలము చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
వేదముల ద్వారా తెలుసుకొనే దైవము, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, యోగులచే ధ్యానింపబడిన పాద పద్మములు కలిగిన వాడు, త్రిమూర్తుల రూపమైన వాడు, సహస్ర నామములు కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
ఆయన దేవాలయమున ఉన్న పుణ్య పుష్కరిణీ స్నానము వలన, వేపచెట్టు క్రింద మట్టి మరియు భస్మము వలన – భూత ప్రేతముల బాధ, దుఃఖములు, కష్టములు, భయములు, రోగములు తొలగించే, ఆత్మ స్వరూపుడై దేహము నందు నివసిస్తున్న, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
నీలకంఠుడు, వృషభమును (ఎద్దును) పతాకమందు చిహ్నముగా కలవాడు, పుష్పములు, గంధము, భస్మముచే అలంకరించబడి శోభిల్లే వాడు, సుపుత్రులు, మంచి ధర్మపత్ని, సత్సంపదలు, అదృష్టములు ఇచ్చే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ఫల శృతి:

బాలాంబిక పతి, జరామరణముల భయమును పోగొట్టేవాడు అయిన వైద్యనాథుని ఈ వైద్యనాథాష్టకం ప్రతి దినము మూడు సార్లు పఠించే వారికి సకల రోగ నివారణ కలుగును అని అర్యోక్తి..!!

Also Read:

ఈ రోజు షేర్స్, పెట్టుబడులు ఏ రాశివారికి లాభాలను ఇస్తుందో తెలుసా..! ఏ దేవుడిని పూజించాలంటే..!