Unique Tradition: పీతలు సమర్పిస్తే చెవి నొప్పి నయం చేసే శివయ్య.. రాముడు నిర్మించిన ఆలయం.. ఎక్కడ ఉందంటే..

శివుడి పూజ అత్యంత సులభం. హర హర మహాదేవ అంటూ అని నీటిని సమర్పించి, బిల్వ పత్రాలు, ఉమ్మెత్త వంటి వాటితో పూజ చేసిన చాలు భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తాడు అని నమ్మకం. అయితే శివయ్య మీద భక్తితో కన్నప్ప, సాలిపురుగు, ఏనుగు, పాములు విభిన్న పద్దతిలో పూజించాయని పురాణాల కథ. ఇలా శివుడికి భక్తులు నిర్మలమైన మనస్సుతో తమకు నచ్చిన విధంగా పూజించే బిన్నమైన సంప్రదాయాలు కూడా ఉన్నాయి. అయితే ఒక శివాలయంలో పీతలను సమర్పిస్తారు. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..

Unique Tradition: పీతలు సమర్పిస్తే చెవి నొప్పి నయం చేసే శివయ్య.. రాముడు నిర్మించిన ఆలయం.. ఎక్కడ ఉందంటే..
Unique Tradition Temple

Updated on: Jul 18, 2025 | 11:48 AM

శివుడికి భక్తులు ఎన్నో రకాల వస్తువులు సమర్పించి పూజలు చేస్తారు. అయితే ఎప్పుడైనా బతికి ఉన్న పీతలను శివుడికి సమర్పించడం ఎప్పుడైనా చూశారా? అవును మన దేశంలో ఒక శివాలయంలో శివ భక్తులు తమ కోరికలు నెరవేరినప్పుడు పీతలను నైవేద్యం పెడతారు. చెవి నొప్పి, చేవికి సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం లభించేందుకు పీతలను శివుడికి నైవేద్యం పెడతారు. ఇక్కడ శివుడికి పీతలను సమర్పించడం ద్వారా పిల్లల చెవి నొప్పి లేదా చెవి సంబంధిత సమస్యలు నయమవుతాయని నమ్మకం.

ఈ ప్రత్యేకమైన శివాలయం గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఉంది. ఈ ఆలయాన్ని రుంధనాథ మహాదేవ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయానికి మరో పేరు రామనాథ శివ ఘేలా మందిరం. ఈ ఆలయాన్ని శ్రీరాముడు స్వయంగా నిర్మించాడని నమ్ముతారు. ఏడాది పొడవునా ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఉంటుంది. మకర సంక్రాంతి రోజున తమ కోరికలు తీర్చుమని కోరుతూ భక్తులు ఇక్కడ శివుడికి పీతలను సమర్పిస్తారు.

ఆలయంలో పీతను సమర్పించడం వెనుక ఉన్న పురాణ కథ
ఈ ఆలయంలో పీతలను సమర్పించే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడ దేవునికి కానుకలు సమర్పించే ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం వెనుక ఒక పురాణ నమ్మకం ఉంది. ఈ ఆలయాన్ని శ్రీరాముడు నిర్మించాడని నమ్ముతారు. ఆ సమయంలో ఇక్కడ సముద్రం ఉండేది. శ్రీరాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు.. ఈ ప్రదేశంలో సముద్రం నుంచి ఒక పీత పదే పదే రాముడి పాదాల వద్దకు వస్తూ ఉండేది. రామ పాదాలను తాకి సంతోశాపడేది. అప్పుడు శ్రీరాముడు పీతకు వరం ఇస్తూ ఈ ఆలయంలో శివయ్యకు నిన్ను నైవేద్యంగా సమర్పిస్తే వారి కోరికలన్నీ నెరవేరుతాయని దీవించాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. రాముడు తన వనవాస సమయంలో ఇక్కడ శివుడిని పూజించాడని చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడి పీతలకు హాని చేయని ప్రజలు
ఆలయంలో సమర్పించే పీతలను అధికారులు సేకరించి.. వాటిని శివుడికి సమర్పించిన తర్వాత.. ఆ పీతలను సేకరించి సముద్రంలో వదిలివేస్తారు.

కోరిక నెరవేరినప్పుడు పీత నైవేద్యం
ఈ ఆలయాన్ని సందర్శించే వారి వ్యాధులు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. చెవి సమస్యలు , పిల్లలలో చెవి నొప్పి కూడా ఇక్కడ పీతలను సమర్పించడం ద్వారా నయమవుతాయి. ఇక్కడికి రావడం ద్వారా ఉపశమనం పొందినవారు లేదా తమ కోరికలు నెరవేరిన తర్వాత ఆ భక్తులు ఇక్కడకు వచ్చి మకర సంక్రాంతి రోజున పీతలను శివుడికి సమర్పిస్తారు.

మరో విలక్షణమైన సంప్రదాయం
ఈ ఆలయం మరొక ప్రత్యేకమైన సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి సమీపంలో ఒక శ్మశానవాటిక ఉంది. ఇక్కడ ప్రజలు తమ ప్రియమైనవారి ఆత్మల కోసం ప్రార్థిస్తారు. వారికి ఇష్టమైన వస్తువులను కూడా అక్కడ నైవేద్యంగా పెడతారు. ఈ ప్రదేశం ఆలయ ప్రాంగణానికి అనుసంధానించబడి ఉంది. ఇక్కడ తమకు ఇష్టమైన వ్యక్తులు మరణిస్తే.. ఆ వ్యక్తులకు ఇష్టమైన వస్తువులను, అది బీడీ, సిగరెట్ లేదా మద్యం అయినా పెడతారు. ఇలా చేయడం ద్వారా మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్మకం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.