Lord Shiva Temple: పంచముఖి శివలింగ క్షేత్ర దర్శనం.. వ్యాధుల నుంచి విముక్తి..

|

Jul 20, 2023 | 6:12 PM

సింహపురిలో ఉన్న అతి పురాతనమైన శివాలయం అని.. నిర్మాణం అద్భుతమని చెప్పారు. ఆలయ గర్భగుడిలో మొత్తం మూడు శివలింగాలు ప్రతిష్టించారు. మధ్యలో పంచముఖి శివలింగం ఉంది. ఈ శివలింగానికి నాలుగు దిశలలో నాలుగు ముఖాలు ఉన్నాయని.. ఒక ముఖం పైకి ఉందని చెప్పారు. 

Lord Shiva Temple: పంచముఖి శివలింగ క్షేత్ర దర్శనం.. వ్యాధుల నుంచి విముక్తి..
Kundeshwar Mahadev Temple
Follow us on

దేశవ్యాప్తంగా అనేక శివాలయాలున్నాయి. కొండ కోనలతో పాటు ఢిల్లీ నుంచి గల్లీ వరకూ లయకారుడైన శివయ్య ఆలయాలు అనేకం ఉన్నాయి. అనేక ఆలయాలు మహిమలు కలవని భక్తుల విశ్వాసం. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొలువైన దేవుళ్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు ఆసక్తిని చూపిస్తారు. అటువంటి మతపరమైన ప్రాముఖ్యత గల నగరాల్లో ఒకటి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని. ఇక్కడ అనేక ఆలయాలున్నాయి. వాటిల్లో ఒక శివాలయాన్ని సందర్శించడం ద్వారా కుటుంబ వృద్ధి, అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన్నప్పుడు వచ్చే శుభ ఫలితం కలుగుతాయని విశ్వాసం. ఏడాది పొడవునా భక్తులు ఈ ఆలయంలో పూజాదికార్యక్రమాలను నిర్వహించి భగవంతుని ఆశీస్సులను పొందుతారు. పండగలు, పర్వదినాల సమయంలో ఈ భక్తుల సంఖ్య రెట్టింపు ఉంటుంది.

ఉజ్జయినిలోని 84 ప్రముఖ శివ క్షేత్రాల్లో 14వ స్థానంలో ఉన్న శ్రీ కుటుంబేశ్వర మహాదేవుడు నిత్యం భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. శివాలయంలోని అర్చకులు పండిట్ అరుణ్ త్రివేది, పండిట్ శ్యామ్ గురు త్రివేది మాట్లాడుతూ  ఈ ఆలయం సింహపురిలో ఉన్న అతి పురాతనమైన శివాలయం అని.. నిర్మాణం అద్భుతమని చెప్పారు. ఆలయ గర్భగుడిలో మొత్తం మూడు శివలింగాలు ప్రతిష్టించారు. మధ్యలో పంచముఖి శివలింగం ఉంది. ఈ శివలింగానికి నాలుగు దిశలలో నాలుగు ముఖాలు ఉన్నాయని.. ఒక ముఖం పైకి ఉందని చెప్పారు.

ఈ ఆలయంలో శివలింగానికి కుడి, ఎడమ వైపున ఉన్న రెండు శివలింగాలు శివలింగం రూపంలో శివపార్వతుల తనయులైన గణేశుడు, కార్తికేయుడు అని నమ్ముతారు.  భైరవుడు, శ్రీ సిద్ధి వినాయకుడు, అష్ట భైరవులలో ఒకరైన భద్రకాళి మాత, శంకరాచార్య విగ్రహం కూడా ఆలయం దర్శనమిస్తాయి.  చాలా పురాతనమైన ఈ ఆలయంలో నంది విగ్రహం నాలుగు స్తంభాల మధ్య కొలువై శివయ్యను దర్శించుకుంటూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

శ్రీ కుటుంబేశ్వర మహాదేవ దర్శనం చేసుకున్నవారి కుటుంబం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అదే సమయంలో మనిషి రోగాల నుండి విముక్తి పొంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయని విశ్వాసం. ఆదివారం, సోమవారాలు, అష్టమి, చతుర్దశిలలో క్షిప్రా స్నానం చేసి శ్రీ కుటుంబేశ్వరుడిని దర్శించుకున్న వ్యక్తికి వేయి రాజ సూర్య యాగం, అశ్వమేధ యాగ ఫలం లభిస్తుందని విశ్వాసం కూడా ఉందని పూజారి చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)