Ugadi 2022: ఉగాదిరోజున ఈ పనులు చేస్తే ఏడాది పొడవునా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం..

|

Mar 30, 2022 | 12:22 PM

Ugadi 2022: తెలుగువారికి కొత్త సంవత్సరం  (Telugu New Year) ఉగాది పర్వదినంతో ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం(Chaitra Maas) వసంత ఋతువు..

Ugadi 2022: ఉగాదిరోజున ఈ పనులు చేస్తే ఏడాది పొడవునా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం..
Ugadi 2022
Follow us on

Ugadi 2022: తెలుగువారికి కొత్త సంవత్సరం  (Telugu New Year) ఉగాది పర్వదినంతో ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం(Chaitra Maas) వసంత ఋతువు కాలంలో ఉగాదిని జరుపుకుంటాము. ఉగాదితోనే పండగలు మొదలవుతాయి. ఈ ఏడాది ఉగాది పర్వదినం శుభకృత్ నామ సంవత్సరంగా ఏప్రిల్ 2వ తేదీన జరుపుకోనున్నాము. అయితే ఈ పండుగ రోజున మనిషి ఎంత జీవితాన్ని ఏ విధంగా గడుపుతాడో.. ఏడాది పొడవునా అదే విధంగా జరుగుతుందని పెద్దల నమ్మకం. అందుకనే ఉగాది పర్వదినం రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలనీ చెప్పారు.

  1. ఉగాది పండుగ రోజున తెల్లవారు జామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలని సుచినారు. తలకు నూనె పెట్టుకుని, మన శరీరానికి నూనె రాసుకుని.. నలుగు పిండి  పెట్టుకుని తైలాభ్యంగన స్నానం చేయాలి.
  2. అనంతరం తప్పని సరిగా కొత్త దుస్తులు ధరించాలి.
  3. ఇష్టదైవాన్ని పూజించి ప్రసాదంగా ఉగాది పచ్చడిని తినాలి. ఇలా ఉగాది రోజున ఉగాది పచ్చడితో రోజుని మొదలు పెట్టాలి.
  4. సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం ఉత్తమం
  5. ఉగాది రోజు నుంచి తొమ్మది రోజుల పాటు రామాయణం పారాయణం చేయడం ద్వారా మేలు  జరుగుతుంది
  6. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను ఏడాదిలో ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తితో భవిష్యత్ ను ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు.
  7. ఉగాది రోజున దమనేన పూజ చేస్తారు.
  8. మొత్తానికి తెలుగు నూతన సంత్సరం రోజున ఉగాది స్పెషల్ గా వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్రదర్శనం, ఆర్యపూజనం, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు.

Also Read: Paresh Rawal: ప్రతిచోటా కమెడియన్స్ డేంజర్లోనే ఉన్నారు.. ‘క్రిస్ రాక్ లేదా జెలెన్స్కీ అయినా అంటున్న పరేష్ రవెల్

ఎంత సంపాదించిన శాంతి లేదా.. అయితే ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటున్న చాణక్య

 ఉగాది మహోత్సవాలకు సిద్ధమైన శ్రీశైలం.. ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 3 వరకు మహోత్సవాలు