Eyes Twitching: స్త్రీపురుషులలో ఆ కన్ను అదిరితే శుభమా..? అశుభమా..? తెలుసుకుందాం రండి..

పిల్లి ఎదురు వచ్చినా.. ఎవరైనా తుమ్మినా కొంత సమయం పాటు ఇంటి బయటకు వెళ్లకూడదని లేదా ఎక్కడికీ బయలు దేరకూడదని అనేక శకునాలకు సంబంధించిన నమ్మకాలు ఉన్నాయి. అలాగే భర్త చనిపోయిన

Eyes Twitching: స్త్రీపురుషులలో ఆ కన్ను అదిరితే శుభమా..? అశుభమా..? తెలుసుకుందాం రండి..
Twitching Of Eyes

Updated on: Mar 13, 2023 | 5:06 PM

సనాతన ధర్మంలోని హిందువులు జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం మాదిరిగానే కొన్ని కొన్ని శకునాలను కూడా నమ్ముతుంటారు. ఆ శకునాలు భవిష్యత్తును సూచిస్తాయని, మార్పును సూచించే సంకేతాలుగా చాలా మంది నమ్ముతారు. ఇక వీటిలో మంచి శకునాలు, అపశకునాలు కూడా ఉంటాయి. ఎలా అంటే పిల్లి ఎదురు వచ్చినా.. ఎవరైనా తుమ్మినా కొంత సమయం పాటు ఇంటి బయటకు వెళ్లకూడదని లేదా ఎక్కడికీ బయలు దేరకూడదని అనేక శకునాలకు సంబంధించిన నమ్మకాలు ఉన్నాయి. అలాగే భర్త చనిపోయిన మహిళ ఎదురుపడినా దుస్సంకేతమని ఇప్పటికీ పాటించే వారు లేకపోలేదు. ఇక కుక్కలు ఏడిస్తే ఏదో చెడు జరుగుతుందని, ఇంట్లోకి గబ్బిలం వచ్చినా అరిష్టం జరుగుతుందని కొందరు నమ్ముతారు. అంతేకాక మహిళలకు కుడి కన్ను కొట్టుకుంటే అరిష్టం అని, మగవారికి ఎడమ కన్ను కొట్టుకుంటే దరిద్రం అని చెబుతుంటారు.ఇలా కుడి కన్ను అదిరితే ఒక అర్థం, ఎడమ కన్ను అదిరితే మరో అర్థం ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నమ్ముతారు. మరి ఈ క్రమంలో స్త్రీపురుషులలో ఏ కన్ను కొట్టుకుంటే మంచిది..? ఏ కన్ను అదిరితే అపశకునం అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

స్త్రీల కళ్లు అదరడం: స్త్రీలకు కుడి కన్ను కొట్టుకోవడం మంచిది కాదని శకునాలపై చేసిన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ స్త్రీలకు కుడి కన్ను కొట్టుకుంటే అది శుభప్రదం కాదని, దురదృష్టమని ఆయా అధ్యయనాలలో చెప్పబడింది. మహిళలకు కుడి కన్ను కొట్టుకుంటే అనారోగ్య సూచకంగా కూడా చెబుతున్నారు. అలాగే స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే ఏదైనా పని ప్రారంభించిన లేదంటే పని గురించి ఆలోచన వచ్చిన అది విజయవంతం అవుతుందని నమ్మకం.

పురుషుల కళ్లు అదరడం: పురుషులకు కుడి కన్ను కొట్టుకుంటే అతని చిరకాల వాంఛ త్వరలో నెరవేరుతుందని, తనకు ఇష్టమైన వారిని కలవడం లేదా ఏదైనా అదృష్టం కలిసి రావడం వంటివి సంభవిస్తాయని పెద్దలు చెబుతారు. సంపద వస్తుందని చెప్పటానికి సూచనగా దీనిని పరిగణిస్తారు. అలాగే పురుషులకు ఎడమ కన్ను కొట్టుకుంటే దురదృష్టం రాబోతుందని సూచన అని పేర్కొన్నారు. ఎడమ కన్ను కొట్టుకోవడం వల్ల పురుషులు ఊహించని ఇబ్బందులకు గురవుతారని మన పూర్వీకుల నాటి నుంచి నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి శకునాలు మరికొన్ని:  కళ్లు అదిరిన మాదిరిగానే క్రింది పెదవి భాగము అదిరితే భోజనసౌఖ్యము.. గడ్డము అదిరిన లాభము-ఇతరుల ద్వారా సహాయ సహకారాలు.. కుడిచెక్కిలి అదిరితే ధనప్రాప్తి, ఎడమచెక్కిలితో చోరబాధలు.. కుడి భుజములు దిరితే భోగసంపదలు వంటి ఫలితాలుంటాయి. అలాగే ఎడమ భుజము అదిరితే కీడు, కష్టాలు.. రొమ్ము అదిరితే ధనలాభము, ధైర్యము.. అరచేయి అదిరితే సంతాన ప్రాప్తి, గౌరవము కలుగుతుందని పండితులు అంటున్నారు.