
Lord Hanuman Puja
హిందూ మతంలో మంగళవారం సంకటమోచన హనుమంతుడికి అంకితం చేయబడినదిగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం , ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే హనుమంతుడి తన భక్తులను ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తాడు. హనుమంతుడి ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఉత్తమ రోజుగా పరిగణించబడుతుంది. మీరు కూడా హనుమంతుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే.. మంగళవారం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..
మంగళవారం నాడు హనుమంతుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలంటే
- హనుమాన్ చాలీసా పారాయణం: మంగళవారం నాడు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా.. హనుమంతుడు సంతోషిస్తాడు. మీపై ఆయన ఆశీస్సులు లభిస్తాయి.
- సుందర కాండ పారాయణం: మంగళవారం నాడు సుందర కాండ పారాయణం చేయడం వల్ల హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.
- మంగళవారం ఉపవాసం: మంగళవారం ఉపవాసం ఉండి హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తాయి.
- లవంగాలు, వక్కలు: మంగళవారం రోజున హనుమంతుని ముందు రెండు లవంగాలు, వక్కలు ఉంచి పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి.
- కొబ్బరికాయ: మంగళవారం నాడు హనుమంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించండి. మంగళవారం నాడు హనుమంతుడి ఆలయంలో కొబ్బరికాయను సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
- రావి ఆకులు: మంగళవారం నాడు 11 రావి ఆకులపై కుంకుమతో ‘జై శ్రీరామ్’ అని రాసి హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి.
మంగళవారం హనుమంతునికి ఏ నూనె దీపం వెలిగించాలి?
హనుమంతుడికి మల్లె నూనె అంటే చాలా ఇష్టం. అందుకే మంగళవారం నాడు హనుమంతునికి మల్లె నూనెతో దీపం వెలిగించాలి. మంగళవారం నాడు హనుమంతుడి ఆలయంలో హనుమంతుడిని సందర్శించిన తర్వాత ఆయనకు మల్లె నూనెను సమర్పించాలి. మంగళవారం నాడు హనుమంతుడికి మల్లె నూనెను సమర్పించడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు.
మంగళవారం రోజున హనుమంతుని అనుగ్రహం కోసం ఏమి సమర్పించాలంటే..
- సింధూరం: మంగళవారం నాడు హనుమంతుడికి సింధూరం సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
- జానేయు అంటే యజ్ఞోపవీతం: మంగళవారం నాడు హనుమంతుడికి యజ్ఞోపవీతంను సమర్పించడం వల్ల అన్ని పనులలో విజయం లభిస్తుంది.
- తమలపాకు: మంగళవారం నాడు హనుమంతుడికి తమలపాకును సమర్పించడం వల్ల భక్తుల బాధలు తొలగిపోతాయి.
- మల్లెల నూనె, పువ్వులు: మంగళవారం నాడు మల్లెల పువ్వులు, మల్లెల నూనెను సింధూరం కలిపి హనుమంతుడికి సమర్పించండి
- బూందీ, లడ్డూ, బెల్లం పప్పు: మంగళవారం నాడు హనుమంతునికి బూందీ, లడ్డూ, బెల్లం-పప్పును నైవేద్యంగా సమర్పించడం వలన సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.