తిరుమల(Tirumala) శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించే కానుకల లెక్కింపు టీటీడీ (TTD) టెక్నాలజీని వాడబడుతోంది. అత్యాధునిక పరకామణి భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. తిరుమలలోని అన్న ప్రసాద కేంద్రానికి ఎదురుగా కొత్త పరకామణి నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయబోతోంది. భక్తులు కానుకల లెక్కింపు ప్రత్యక్షంగా వీక్షించేలా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను అమర్చనుంది టీటీడీ. నాణేల లెక్కింపు సమస్య ను అధిగమించేందుకు టెక్నాలజీని వాడుతోంది. అత్యాధునిక యంత్రాలను కొత్త పరకామణికి అందుబాటులో తీసుకురానుంది. ఇప్పటిదాకా శ్రీవారి ఆలయంలోని గర్భ గుడి వెనుక ప్రాకారంలో ఉన్న పరకామణి కానుకల లెక్కింపు ఇబ్బందిగా మారడంతో టీటీడీ కొత్త ఆలోచనకు తెర తీసింది. వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులు సమర్పించే ముడుపులు హుండీ ద్వారా టిటిడి కి ఆదాయం సమకూరుతుండగా కోట్లాది రూపాయల నోట్లు, నాణ్యాలు లెకింపు లో సిబ్బంది ఇబ్బంది పడుతుండటంతో టీటీడీ 10 కోట్ల రూపాయలతో పరకామణి సిద్ధం చేస్తోంది.
పరకామణి లెక్కించే సిబ్బంది..
భక్తులు సమర్పించే కానుకలతో రోజుకు 9 నుంచి 13సార్లు నిండుతున్న హుండీలోని కానుకలను పరకామణి లెక్కించే సిబ్బంది నోట్లు, నాణేలు, విదేశీ కరెన్సీని వేరు చేసి లెక్కిస్తారు. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రోజుల్లో మినహా మిగిలిన అన్నీ రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హుండీ లెక్కింపు జరుగుతోంది. హుండీ లెక్కింపులో టీటీడీ సిబ్బంది, వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులతోపాటు పరకామణి సేవలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు టీటీడీ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని హుండీ లెక్కింపులో పాల్గొనే అవకాశం ఉంది. ఇలా 250 మందికి పైగా రోజూ రెండు షిప్టుల్లో పరకామణిలో హుండీ లెక్కింపులో పాల్గొంటారు. దీంతో ప్రస్తుతం ఉన్న పరకామణి సిబ్బందికి అనువుగా లేకపోవడం, కానుకల లెక్కింపు ఆలస్యంగా సాగుతుండడం.. గాలి వెలుతురు ఇబ్బందిగా ఉండటంపై ఇబ్బందిగా మారుతోంది.
పరకామణి సమస్యలను పరిష్కరించేందుకు..
దీంతో టీటీడీ పాలక మండలి పరకామణి సమస్యలను పరిష్కరించేందుకు పరకామణిని ఆలయం బయటకు తీసుకురావాలని నిర్ణయించింది. 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గత ఏడాది ఆగస్టులో శంకుస్థాపన చేసింది టీటీడీ కొత్త పరకామణి ని బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ అనే దాత విరాళంతో నిర్మిస్తోంది. 14,962 చదరపు అడుగుల్లో పరకామణి భవనాన్ని నిర్మిస్తున్న టీటీడీ ఈ ఏడాది జూన్ లోపు పూర్తి చేయనుంది. 4 బ్లాకుల్లో కొత్త పరకామణి నిర్మాణం జరుగుతుండగా అందులోనూ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, సిబ్బంది, వెయిటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ లను డోనార్ సెల్ వెయిటింగ్ హాల్ ను నిర్మిస్తోంది.
పరకామణి సొమ్మును భద్రపరిచేందుకు..
బ్యాంకుల్లో ఉపాధి చేసే పరకామణి సొమ్మును భద్రపరిచేందుకు 10 స్ట్రాంగ్ రూమ్ లను అందుబాటులోకి తీసుకుని రానుంది. జర్మనీ టెక్నాలజీతో తయారు చేసిన రెండు యంత్రాలను నాణేల లెక్కింపుకు ప్యాకింగ్ కోసం ఏర్పాటు చేయనున్న టీటీడీ 2.80 కోట్ల రూపాయలతో ఈ రెండు యంత్రాల కొనుగోలుకు సంబంధించిన టెండర్లను కూడా ఆమోదించింది.
భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా..
హుండీ లెక్కింపును భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను పరకామణి భవనానికి అమర్చబునడగా భవనం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనుంది. ఆలయం నుంచి హుండీ గంగాళాలను టవర్ క్రేన్ల సాయంతో వెలపలకు తీసుకొచ్చి బ్యాటరీ వాహనాల ద్వారా కొత్త పరకామణి భవనానికి చేరవేసేలా ప్రణాళికలు రూపొందించింది.
రాజు, తిరుపతి, టీవీ9 తెలుగు
ఇవి కూడా చదవండి: Eyes Care Tips: కళ్లల్లో మంట, దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోం రెమెడీస్‌ని అనుసరించండి..
Russia Ukraine War Live: ఉక్రేనియన్ సైన్యం చేతిలో మరో రష్యన్ సైనికాధికారి మృతి