TTD Tickets: తిరుమల శ్రీవారి భక్తుల అలర్ట్.. నేడే ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల..

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది టీటీడీ. మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్లను ఏప్రిల్‌ 25న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఉదయం 10గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

TTD Tickets: తిరుమల శ్రీవారి భక్తుల అలర్ట్.. నేడే ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల..
TTD NEWS

Edited By: Ravi Kiran

Updated on: Apr 25, 2023 | 3:51 PM

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది టీటీడీ. మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్లను ఏప్రిల్‌ 25న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఉదయం 10గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు భక్తులు టిటిడి అధికారిక వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in/ లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

ఇక తిరుమలేశుడి దర్శనం కోసం భక్తుల పడే ఆరాటాన్ని కొందరు కేటుగాళ్లు ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్ సైట్లు సృష్టించి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులను అలర్ట్ చేసింది టీటీడీ. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్‌ TTDevasthanams కూడా వినియోగించవచ్చని సూచించింది. సందేహాల నివృత్తికై.. టీటీడీ హెల్ప్ లైన్ నెంబర్‌ను సంప్రదించవచ్చునని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..