Tirumala Virtual Seva Quota: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కోలువైన తిరుమల తిరుపతికి దేశవిదేశాల నుంచి భక్తులు వస్తారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. వజ్రకిరీట ధారి ఆలయం రోజుకొక ఉత్సవవంతో నిత్యకల్యాణం పచ్చ తోరణం అన్నచందంగా ఉంటుంది. టీటీడీ అధికారులు జూలై నెలలో శ్రీవారికి జరిగే ఉత్సవాల దర్శనం కోసం టికెట్ల కోటాను విడుదల చేశారు.
జులై నెలలో తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు ప్రత్యేకంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను మంగళవారం టిటిడి విడుదల చేసింది. ఈ సేవా టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇళ్ల నుండే వర్చువల్ విధానంలో ఈ సేవల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా ఈ సేవల టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది. కాగా, కల్యాణోత్సవం టికెట్లు పొందిన గృహస్తులకు(ఇద్దరికి) ఆ టికెట్‌పై ఉచితంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. అయితే, కల్యాణోత్సవం టికెట్ పొందిన భక్తులు తమకు సౌకర్యవంతమైన తేదీనాడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read: RBI: అవుట్ సోర్సింగ్ పాలసీపై మార్గదర్శకాలను విడుదల చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా