TTD News: తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 20న నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్స్ విడుదల

|

Mar 17, 2021 | 6:10 PM

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త వచ్చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి దర్శన టిక్కెట్లను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

TTD News: తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 20న నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్స్ విడుదల
TTD
Follow us on

Tirupathi Lord Balaji:  తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త వచ్చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి దర్శన టిక్కెట్లను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్స్ శనివారం ఉదయం 9 గంటలకు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటాయి. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రోజుకు 25 వేల టికెట్ల చొప్పున నెల రోజుల కోటా విడుదల చేయనున్నారు. అదే రోజున సాయంత్రం తిరుమలతో పాటు.. తిరుపతిలో గల టీటీడీ వసతి గదులను వెబ్‌సైట్‌ ద్వారా విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధ‌వారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో కనువిందు చేశారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఉద‌యం 8 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు

సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో ఏర్పడిన కలహాన్ని నివారించి, సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తారు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరని, ఈ మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు. అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేస్తారు. కాగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు గరుడసేవ జరగనుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Also Read:

చిత్తూరు జిల్లాలో ఇంకా గసగసాల స్మెల్.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.. డ్రగ్ తయారికి దీన్ని ఎలా వినియోగిస్తారంటే..?

Vakeel Saab Review: సినిమా బ్లాక్ బస్టర్, పవన్ ఈజ్ బ్యాక్… ఫస్ట్ రివ్యూ చెప్పేసిన ఆ క్రిటిక్