AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. 4రోజుల పాటు సిఫార్స్ లెటర్స్‌కు స్వస్తి.. కంపార్ట్ మెంట్స్‌లో భారీగా భక్తుల రద్దీ

Tirumala Rush: దాదాపు రెండేళ్ల తర్వాత.. తిరుమల క్షేత్రంలో స్వర్వదర్శనానికి (sarvadarshanam) అనుమతినిస్తుండడంతో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు గంటల..

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. 4రోజుల పాటు సిఫార్స్ లెటర్స్‌కు స్వస్తి.. కంపార్ట్ మెంట్స్‌లో భారీగా భక్తుల రద్దీ
Tirumala Rush
Surya Kala
|

Updated on: Apr 13, 2022 | 6:04 PM

Share

Tirumala Rush: దాదాపు రెండేళ్ల తర్వాత.. తిరుమల క్షేత్రంలో స్వర్వదర్శనానికి (sarvadarshanam) అనుమతినిస్తుండడంతో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు గంటల తరబడి కంపార్ట్మెంట్స్ లో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయంపై టీటీడీ(TTD) అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి (EO Dharma reddy) స్పందించారు. శ్రీవారి దర్శనానికి సామాన్య భక్తులుకు వీఐపీ భక్తులు తరహలో దర్శన భాగ్యం కల్పిచేందుకే స్లాటడ్ విధానాన్ని అనుసరించామని చెప్పారు. ఈనెల 9వ తేదీన  మూడు రోజులకు సంభందించిన టోకెన్లు జారీ పూర్తవ్వడంతో తాత్కలికంగా నిలిపివేశామని.. నిన్న(మంగళవారం రోజున) తిరిగి రోజుకి 35 వేల టోకెన్లు జారి చేసే ప్రకియ ప్రారంభించామని చెప్పారు. అయితే నిన్న టోకెన్లు జారి చేసే సమయంలో 20 వేల మంది మాత్రమే వున్నారు. అయితే భక్తులు దర్శన టోకెన్ల కోసం పోటీపడటంతో క్యూ లైనులో ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. తాము అందరినీ దర్శన టోకెన్లు ఉన్నాయని.. భక్తులు పోటీ పడవద్దని భక్తులను ప్రాధేయపడినప్పటికీ భక్తులు వినలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ధర్మారెడ్డి.

తిరుమలలో భక్తుల రద్దీని మేము సరిగ్గా మేనేజ్ చేయలేకపోయామని ఆరోపించడం బాధాకరమన్నారు. అయితే నిన్నటి ఘటన నేఫథ్యంలో వెంటనే సర్వదర్శనం టోకెన్ విధానాన్ని రద్దు చేసి భక్తులను తిరుమలకు అనుమతించామని తెలిపారు. అరగంటలోనే భక్తులును కంపార్టుమెంట్లలోకి అనుమతించామని చెప్పారు దీంతో భక్తులు కంపార్టుమెంట్లలోనే అధిక సమయం వేచి వుండవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాము భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించలేదని చెప్పారు ధర్మారెడ్డి. శ్రీవారి మెట్టు మార్గానికి ఏఫ్రిల్ 30వ తేది లోపు పున:ప్రారంభిస్తామని శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు.

ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని..  ఫిజికల్ వెయిటింగ్ పద్ధతిని అమలు చేస్తున్నామని చెప్పారు. నిజానికి ఫిజికల్ వెయిటింగ్ సిస్టం అంటే భక్తులను ఇబ్బంది పెట్టడమే. అయినప్పటికీ తప్పడం లేదని.. ఈ ఫిజికల్ సిస్టం లో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ తెలిపారు.

భక్తుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు రోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని.. రద్దీని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని తెలిపారు. భక్తుల రద్దీపై టీటీడీ అప్రమత్తంగా లేదంటూ చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుపతిలో నిన్న జరిగిన సంఘటన మీడియా సృష్టే అంటూ టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Also Read: Humanity: మానవత్వం పరిమళించిన వేళ… కరోనా కల్లోలంలో టీచర్.. ఫుడ్ డెలివరీ బాయ్ అయిన వైనం.. బైక్ కొనిచ్చిన నెటిజన్లు..

Mango prices: దుమ్ము రేపుతున్న మామిడి ధర.. తినేవాళ్లకు కష్టం.. అమ్మేవాళ్లకు అదృష్టం