Mango prices: దుమ్ము రేపుతున్న మామిడి ధర.. తినేవాళ్లకు కష్టం.. అమ్మేవాళ్లకు అదృష్టం
ఈసారి మామాడి ధరలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. తియ్యయైన మామాడిపండును టేస్ట్ చేద్దామంటే.. జేబులో నుంచి పెద్ద నోటు తీయాల్సి వస్తుంది. వివరాలు తెలుసుకుందాం పదండి...
ఈ ఏడాది మామిడి రికార్డ్ ధర పలుకుతోంది. మామిడి పండ్లు ఈ సంవత్సరం టన్నుకు 80 వేల నుంచి లక్ష రూపాయల ధర పలుకుతున్నాయి. అయితే వినియోగదారులకు మాత్రం ఇలాగైతే తినేదెలా అని అంటున్నారు. వరంగల్(Warangal) లక్ష్మీపురం పండ్ల మార్కెట్ మామిడికి ఫేమస్.. ఇక్కడి నుంచి పంజాబ్(Punjab), హర్యానా(Haryana), ఉత్తర ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ వంటి రాష్ట్రాలతో పాటు నేపాల్ కు మామిడి పండ్లను ఎగుమతి చేస్తారు. మామిడిపళ్లలో రారాజు బంగినపల్లి. ఈ సంవత్సరం బంగినపల్లి మామిడిపండు టన్నుకు లక్ష రూపాయల వరకు పలుకుతుంది. వర్షాలు చీడపీడలతో మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత సంవత్సరం ఏప్రిల్లో 10వ తేదీ వరకు మార్కెట్ కు 1,581 టన్నుల మామిడి విక్రయానికి వచ్చింది. అయితే ఈ సంవత్సరం మాత్రం ఇప్పటి వరకు కేవలం 56 టన్నులు మాత్రమే రైతుల విక్రయించేందుకు తీసుకువచ్చారు.
గతంలో ఎకరా మామిడి తోటకు 12 నుంచి 15 టన్నుల దిగుబడి వచ్చేది. ఇప్పుడు మాత్రం రెండు మూడు టన్నుల కన్నా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. గత సంవత్సరం దిగుబడి ఉండటంతో టన్నుకు15 వేల నుంచి 35 వేల వరకు ధర పలికింది. అయితే ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గడంతో టన్నుకు 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ధర పలుకుతోంది. ఇక బయట రిటైల్ మార్కెట్‌లో కూడా క్వాలిటీ మామిడి పండ్లను కేజీ రూ.150 వరకు అమ్ముతున్నారు. గతంలో రూ.60 నుంచి రూ.70 వరకు ఉండేది. మొత్తంగా వేసవి సీజన్‌లో విరివిగా లభించే మామిడి సామాన్యులకు అందని ద్రాక్షగా మామిడి మారిపోయింది.
Also Read: Telangana: ఆలయ ప్రహరీ పునాది తవ్వుతుండగా బయటపడ్డ పెట్టె.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్