Hanuman Jayanthi: కోరిన కోర్కెలు తీరాలంటే.. హనుమాన్ జయంతి రోజున ఏ రాశివారు ఏ ప్రసాదం సమర్పించాలంటే..

Hanuman Jayanthi 2022: ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమ రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం... ఈ ఏడాది హనుమాన్ జయంతి  ఏప్రిల్ 16..

Hanuman Jayanthi: కోరిన కోర్కెలు తీరాలంటే.. హనుమాన్ జయంతి రోజున ఏ రాశివారు ఏ ప్రసాదం సమర్పించాలంటే..
Hanuman Jayanti Puja
Follow us
Surya Kala

|

Updated on: Apr 13, 2022 | 4:01 PM

Hanuman Jayanthi 2022: ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమ రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం… ఈ ఏడాది హనుమాన్ జయంతి  ఏప్రిల్ 16(శనివారం)వచ్చింది. హనుమంతుడిని పవన పుత్రుడు,  ఆంజనేయ అని కూడా పిలుస్తారు. హనుమంతుడి ని జయంతికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఉపవాసం ఉంటారు. ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా.. మీరు మీ రాశిచక్రం ప్రకారం ( హనుమాన్ జయంతి 2022 ) దేవునికి ఏ రకమైన ప్రసాదం సమర్పించాలీ.. ఏ ప్రసాదం సమర్పిస్తే.. కోరిన కోర్కెలు తీరడమే కాదు.. విజయం మీ సొంతం అవుతుందో ఈరోజు తెలుసుకుందాం..

హనుమంతుడిని పూజించాల్సిన పద్దతి: 

హనుమంతికి జయంతి కి ఉపవాసం చేయాలనుకునేవారు వారు.. ముందు రోజు రాత్రి నేలపై నిదురించాల్సి ఉంది. రాముడు, సీతాదేవి , హనుమంతుడిని ప్రార్థించండి.

హనుమాన్ జయంతి నాడు తెల్లవారు జామునే నిద్ర లేచి అభ్యంగ స్నానం శుభ్రమైన బట్టలు ధరించండి.

చేతిలో నీరు తీసుకుని ఉపవాస ప్రమాణం చేయండి.

అనంతరం పూజ గదిలో హనుమంతుడి పటం దగ్గర పూజ ఏర్పాటు చేసుకోండి

పూజ కోసం, తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టండి.

హనుమాన్ చాలీసా చదవండి. హనుమంతుడిని ప్రార్థించండి.

షోడశోపచార (16 ఆచారాలు)ను అనుసరించి హనుమంతుడిని ఆరాధించండి.

ఏ రాశివారు ఏ విధమైన ప్రసాదం సమర్పించాలంటే..  

మేషరాశి:  ఈ రాశి వారు హనుమంతునికి శనగపిండి లడ్డూలను సమర్పించాలి.

వృషభం: ఈ రాశి వారు హనుమాన్ జయంతి నాడు తులసి విత్తనాలను సమర్పించాలి.

మిధున రాశి: ఈ రాశి వారు హనుమంతుని పూజించేటప్పుడు తులసి ఆకులను సమర్పించాలి.

కర్కాటక రాశి:  కర్కాటక రాశి వారు ఆవు నెయ్యితో చేసిన శెనగపిండిని నైవేద్యంగా సమర్పించాలి.

సింహరాశి : ఈ రాశి వారు హనుమంతునికి జిలేబీని సమర్పించాలి.

కన్య రాశి: ఈ రాశి వారు దేవునికి వెండి రేకుతో ఉన్న స్వీట్లను సమర్పించాలి.

తుల రాశి:  ఈ రాశివారు మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఆవు నెయ్యితో చేసిన శెనగపిండి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.

ధనుస్సు రాశి: ఈ  రాశి వారు హనుమాన్ జయంతి నాడు లడ్డూ, తులసి ఆకులను నైవేద్యంగా పెట్టాలి.

మకరరాశి : ఈ రాశి వారు మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి.

కుంభ రాశి: ఈ రాశి వారు హనుమాన్ జయంతి నాడు ఎర్రటి వస్త్రం , లడ్డూలను సమర్పించాలి.

మీన రాశి: ఈ రాశివారు హనుమాన్ జయంతి రోజున లవంగాలు సమర్పించాలి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి  ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Viral Video: పుట్టని పిల్లలకోసం తల్లిపక్షి తపన..! హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో నెట్టింట్లో వైరల్