తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆక‌స్మిక తనిఖీ.. డిప్యూటీ ఈవో నాగరాజుకు కీలక ఆదేశాలు

తిరుమలలో ఆక‌స్మిక తనిఖీలు చేపట్టారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కరోనా నిబంధనల సడలింపు తర్వాత భక్తులకు అందుతున్న సేవలు పరిశీలించారు. భక్తులకు అందుతున్న సేవలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆక‌స్మిక తనిఖీ.. డిప్యూటీ ఈవో నాగరాజుకు కీలక ఆదేశాలు
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 06, 2021 | 5:12 PM

TTD Chairman YV Subba Reddy : తిరుమలలో ఆక‌స్మిక తనిఖీలు చేపట్టారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కరోనా నిబంధనల సడలింపు తర్వాత భక్తులకు అందుతున్న సేవలు పరిశీలించారు. భక్తులకు అందుతున్న సేవలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్న ప్రసాదం భవనంలోకి వెళ్లి భోజనం చేస్తున్న భక్తులతో మాట్లాడారు. అక్కడే గంట పాటు గడిపిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి… కాసేపు భక్తులకు అన్నం వడ్డించారు. అన్న ప్రసాదం పారేయకుండా జాగ్రత్తగా వడ్డించేలా చర్యలు తీసుకువాలని అన్నదానం డిప్యూటీ ఈవో నాగరాజుకు ఆదేశించారు.

వడ్డించేటప్పుడు కింద పడిన అన్నాన్ని భక్తులు తొక్కుతున్నారని అలా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో నాగరాజుకు సూచించారు. తమకు అందుతున్న సేవల గురించి భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్న ప్రసాదం రుచి, నాణ్యత బాగున్నాయని చెప్పారు. వసతి, ఇతర సదుపాయాలకు సంబంధించి తిరుమల్లో సూచిక బోర్డులు లేనందువల్ల ఇబ్బంది పడ్డామని చెప్పడంతో చర్యలు తీసుకుంటామన్నారు సుబ్బారెడ్డి రెడ్డి.

ఈ నెల 19వ తేదీ రథ సప్తమి సందర్భంగా మాడవీధుల్లో చేస్తున్న ఏర్పాట్లు పరిశీలించారు. తర్వాత లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్లు తనిఖీ చేశారు. కవర్లు ఎంతకు విక్రయిస్తున్నారని భక్తులను అడిగి తెలుసుకున్నారు సుబ్బారెడ్డి. అధునాతన థర్మో ఫ్లూయిడ్ టెక్నాలజీతో నిర్మించిన బూందీ పోటు పరిశీలించారు. ఇండియా సిమెంట్స్ సంస్థ విరాళం కింద నిర్మించిన నూతన పోటులో ట్రయల్ రన్ చేశారని, త్వరలోనే పూర్తి స్థాయిలో కొత్త పోటు ప్రారంభిస్తామని చైర్మన్ మీడియాతో చెప్పారు.

మార్చి నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను ఆర్జిత సేవలకు అనుమతిస్తామని తెలిపారు. విశాఖ, అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాలలో త్వరలోనే కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13న చెన్నైలో పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు.

గుంటూరుకు చెందిన కాటూరి రాము అనే మరో భక్తుడు టీటీడీకి ఊరగాయలను విరాళంగా అందించాడు. అన్నప్రసాదంలో భక్తులకు వీటిని వడ్డించాలని కోరాడు. సుమారు రెండు టన్నుల వివిధ రకాల ఊరగాయలను తిరుమల దేవస్థానానికి అప్పగించాడు.

ఇవి కూడా చదవండి

ఏడాది గడిచిన అదే జోరు.. వ్యాక్సిన్ వచ్చిన తగ్గని తీవ్రత.. మాయదారి మహమ్మారికి అంతమెప్పుడు..? Farm Laws: ఆ చట్టాలు.. రైతులు, కార్మికులకే కాదు.. యావత్ దేశానికి ప్రమాదకరం: రాహుల్ గాంధీ