TTD Board Members: ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల నియామకం ఖరారైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు తమ వారిని ఈ బోర్డులో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ కు సిఫార్సు చేసారు. రెండో సారి వరుసగా వైవీ సుబ్బారెడ్డిని ఛైర్మన్ గా నియమించిన తరువాత బోర్డును సైతం వెంటనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దిశగా టీటీడీ బోర్డు కొత్త పాలక వర్గం ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. దీనికి సంబంధించిన తుది జాబితా విడుదలైంది. 25మంది సభ్యుల జాబితా ఇలా ఉంది.
బోర్డు సభ్యుల వివరాలను ఈ సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారికంగా ప్రకటించారు. పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. గత పాలక వర్గంలో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా అందులో 24 మంది పాలకమండలి సభ్యులు, 8మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమితులయ్యారు. అయితే ఈసారి ఆ సంఖ్యను కుదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తూ పాలకమండలి కూర్పు జరిగింది.
కొత్త పాలక మండలి సభ్యులు
ఏపీ నుంచి పోకల అశోక్‌కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గొర్ల బాబూరావు, మధుసూదన్ యాదవ్, తెలంగాణ నుంచి మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు, జీవన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, పార్థసారథిరెడ్డి, మారంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్‌రావు, తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య, కర్నాటక నుంచి శశిధర్, ఎమ్మెల్యే విశ్వనాథరెడ్డి, మహారాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్‌కు అవకాశం కల్పించారు. మారుతి, సౌరభ్ , కేతన్ దేశాయ్, శ్రీనివాసన్ పేర్లు పాలకమండలి సభ్యుల జాబితాలో ఉన్నట్టు సమాచారం
రాష్ట్ర విభజనకి ముందు వరకు 12 మంది పాలకమండలి సభ్యులు., టీటీడీ ఈవో., రెవెన్యూ ప్రినిసిపల్ సెక్రటరీ, దేవాదాయశాఖ కమిషనర్లు ఎక్స్ ఆఫీసియో మెంబర్లుగా ఉండే వారు. విభజన అనంతరం చంద్రబాబు ఆ సంఖ్యను 15కు పెంచుతూ ముగ్గురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అనంతరం సీఎం పీఠం ఎక్కిన జగన్ ఆ సంఖ్యను 25కి పెంచారు. 11 మంది ప్రత్యేక ఆహ్వానితులని నియమించారు. ఇప్పుడు సభ్యుల సంఖ్య 25 ఉండగా.. ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య 50కి పెరిగింది.
ప్రస్తుతం విడుదలైన లిస్టుకి తోడు.. మరో 50మంది ప్రత్యేక ఆహ్వానితుల లిస్టు కూడా విడుదల కావాల్సిఉంది. త్వరలోనే ఈ పేర్లను అధికారికంగా ప్రకటించనుంది ప్రభుత్వం. పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు..
Read Also… టెస్ట్ క్రికెట్ సంచలనం.. 28 ఫోర్లు, 11 సిక్సర్లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. ఆ ప్లేయర్ ఎవరంటే.!