Ontimitta: నేత్రపర్వంగా కోదండరాముడి బ్రహ్మోత్సవాలు.. భక్తులందరికీ సీతారాముల తలంబ్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ రామాలయం ఒంటిమిట్ట(Ontimitta) కోదండరాముడి కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులందరికీ తలంబ్రాలు అందజేస్తామని టీటీడీ(TTD) అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. రాముల వారి కల్యాణ వేడుకులకు 80 శాతం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ రామాలయం ఒంటిమిట్ట(Ontimitta) కోదండరాముడి కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులందరికీ తలంబ్రాలు అందజేస్తామని టీటీడీ(TTD) అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. రాముల వారి కల్యాణ వేడుకులకు 80 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. కల్యాణం రోజు ఆలయం నుంచి సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల శోభాయాత్ర ప్రారంభమవుతుందని, అదే రోజు సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు(Brahmotsava) తరలివచ్చే భక్తులకు భక్తి శ్రద్ధలతో సేవలందించాలని శ్రీవారి సేవకులకు సూచించారు. సీతారాముల పరిణయ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందున భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపారు. కడప – రేణిగుంట జాతీయ రహదారిలో తనిఖీ కేంద్రాల ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు.
ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, 3.30 గంటల నుంచి ఆలయశుద్ధి, 4 గంటల నుంచి సర్వదర్శనం, 8 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 4 గంటల నుంచి పోతన జయంతి, కవి సమ్మేళనం, 5.30 నుంచి 10 గంటల వరకు సర్వ దర్శనం, రాత్రి 7 గంటలకు శేష వాహనంపై స్వామి గ్రామోత్సవం, 10 గంటలకు ఏకాంత సేవ ఉంటాయని ఆలయ అధికారులు, అర్చకులు వెల్లడించారు.
Also Read
Viral Video: డీజె ఎఫెక్ట్.. స్టేజ్‌పైనే డ్యాన్స్ చేసిన పెళ్లికూతురు.. బిత్తరపోయిన పెళ్లికొడుకు..!