Vastu Tips: సాయంత్రం వేళ ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు..!
Vastu Tips: జీవితంలో సంతోషం, శ్రేయస్సు పెంపొందించడానికి వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రంలో అనేక నివారణలు పేర్కొనడం జరిగింది. ఈ సూచనలు విస్మరించడం..
Vastu Tips: జీవితంలో సంతోషం, శ్రేయస్సు పెంపొందించడానికి వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రంలో అనేక నివారణలు పేర్కొనడం జరిగింది. ఈ సూచనలు విస్మరించడం వలన ఇంట్లో చికాకులు, అశాంతి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశమూ ఉంది. వాస్తు దోషాలు మనల్ని వెంటాడుతాయని విశ్వాసం. ఫలితంగా కుటుంబంలో ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు వెంటాడుతాయి. అయితే, వాస్తు, జ్యోతిష్య శాస్త్రంలో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో చేయాల్సిన, చేయకూడని పనులను గురించి పేర్కొనడం జరిగింది. వాటిని పాటించడం ద్వారా కుటుంబ శ్రేయస్సును పెంచుకోవచ్చని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు పొరపాటున కూడా సాయంత్రం పూట ఈ పనులు చేస్తే ధన నష్టం, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. మరి సాయంత్రం వేళ ఏం చేయొద్దో ఇప్పుడు తెలుసుకుందాం..
సాయంత్రం పూట ఈ పనులు చేయడం మానుకోండి.. 1. కొందరికి సాయంత్రం పూట ఇల్లు ఊడ్చే అలవాటు ఉంటుంది. ఇంటిని శుభ్రపరిచినట్లు అనిపించినప్పటికీ.. ఇది మీ భద్రతపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం.. సాయంత్రం పూట ఇంటిని శుభ్రపరచడం వలన డబ్బు కొరత ఏర్పడుతుంది. చీపురు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి సంబంధించినదని విశ్వాసం. సాయంత్రం పూట ఊడ్చడం వల్ల ఆమెకు అవమానం జరగినట్లుగా భావించి ఆగ్రహానికి గురవుతుందట. కావున.. సూర్యస్తమయానికి ముందే ఈ పని చేయాలని సూచిస్తున్నారు పండితులు.
2. అలసట నుండి ఉపశమనం పొందడానికి కొంతమంది పని నుండి తిరిగి వచ్చిన తర్వాత టీ తాగుతుంటారు. కొంతమంది తులసి ఆకులు వేసిన టీ తాగుతారు. అయితే, సూర్యాస్తమయం తరువాత తులసి ఆకులను పొరపాటున కూడా తాకకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుందట.
3. చాలా సార్లు కొంతమంది సన్యాసులు సాయంత్రం ఇంటికి వచ్చి దానధర్మాలు చేయమని కోరడం జరుగుతుంది. అలా వచ్చిన వారికి తప్పకుండా ఏదో ఒకటి దానం చేయాలి. సాయంత్రం వేళ భిక్షాటనకు వచ్చిన సన్యాసులకు దానం చేయడం ద్వారా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
4. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవద్దు. పగటిపూట ఎంతసేపైనా నిద్రపోవచ్చు కానీ.. సూర్యాస్తమయం సమయంలో నిద్రించడం ఇంటికి అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో తల్లి లక్ష్మి ఇంటికి చేరుకుంటుంది. ఆ సమయంలో నిద్రపోవడం వలన ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ద్రువీకరించడం లేదు.)
Also read:
Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!
Saving Account: సేవింగ్స్ ఖాతాపై 5% వడ్డీ ఇస్తోన్న బ్యాంక్.. కనీస మొత్తం ఎంత ఉండాలంటే..