ఇవాళ ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం, సంపూర్ణమైన చంద్రగ్రహణం ఇవాళ ఏర్పడుతోంది. ఈ ఏడాది చివరగా సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.30 కొనసాగనుంది. సూర్యగ్రహణం ఏర్పడిన పదిహేను రోజుల గ్యాప్‌లోనే చంద్రగ్రహణం ఏర్పడడం గమనార్హం. ఈ ఏడాది ఏర్పడిన మొత్తం నాలుగు గ్రహణాలు.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే కనిపించడం విశేషం. ఇవాళ్టి సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌తోపాటు పలుదేశాల్లో కనిపించనుంది. ఈ చంద్రగ్రహణం పాక్షికమైనదే అయినా.. దీని ప్రభావం మనపై ఉంటుంది అంటున్నారు. ఈ చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర ఫసిఫిక్, హిందుమహా సముద్ర ప్రాంతాల్లో కనిపించనుండగా.. ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ 2025 మార్చి 14న ఏర్పడనుందని ఖగోళ పరిశోధకులు తెలిపారు.
గ్రహణానికి సుమారు 9 గంటల ముందే సూతక్ కాలం ప్రారంభమవుతుంది. చంద్ర గ్రహణం సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది. దీని ప్రభావం భారతదేశంలో పాక్షికంగా ఉంటుంది. అయితే సూతక్ కాలం మాత్రం ఉంటుంది. ఈ సూతక్ కాలం నుండి గ్రహణం పూర్తయ్యే వరకు దేవుని విగ్రహాలను లేదా ఫొటోలను తాకరాదు. ఈ సమయంలో ఆహారం వండటం, గోళ్లు కత్తిరించడం వంటివి చేయకండి.
భారతదేశంలో ఈ చంద్రగ్రహణం నవంబర్ 8, 2022 న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.32 గంటలకు కనిపిస్తుంది. సాయంత్రం 6.18 గంటలకు ముగుస్తుంది. గ్రహణం అనేది ఖగోళ సంబంధమైన సంఘటన అయినప్పటికీ.. జ్యోతిషశాస్త్రంలో దీనికి అధిక ప్రధాన్యత ఉంది. గ్రహణాలను జ్యోతిష్య శాస్త్రంలో చాలా గొప్ప పరిణామంగా చెప్పబడింది. చాలా మార్పులకు ఇది కారణంగా ఉంటుందని చెప్పింది. అయితే చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలి..? ఏం చేయకూడదో తెలుసుకుందాం.
చంద్రగ్రహణానికి సరిగ్గా 9 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. నవంబర్ 8న ఉదయం 8.29 గంటలకు సుతక్ భారతదేశంలో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పూజలు చేయవద్దు. మానసిక జపం చేయండి. వంట చేయడం .. తినడం మానుకోండి. అయితే, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు తినడానికి, త్రాగడానికి మినహాయింపు ఉంది. గర్భిణీ స్త్రీలు కుట్టుపని ఎంబ్రాయిడరీ చేయకూడదు. కత్తెరలు, కత్తులు ఉపయోగించకూండా ఉండటం మంచిది.
చంద్రగ్రహణం ప్రభావం మనస్సుపై ప్రభావం చూపుతుంది. దీని దుష్ఫలితాలు రాకుండా ఉండాలంటే గ్రహణ కాలంలో ధ్యానం చేయాలి. ఈ సమయంలో, డబ్బు, ఆహార ధాన్యాలు పేద ప్రజలకు విరాళంగా ఇవ్వాలి. గ్రహణ సమయంలో కనీసం 108 సార్లు మీ అధిష్టాన దేవత మంత్రాలను జపించండి. శివలింగానికి నీటిని సమర్పించి “ఓం నమః శివాయ” మంత్రాన్ని జపించండి. ఇది చంద్రగ్రహణం సమయంలో చెడు ప్రభావాలను ప్రభావితం చేయదు. గ్రహణ సమయంలో దూర్వా గడ్డి లేదా గరకని మీ దగ్గర ఉంచండి. ఈ సమయంలో మానసిక లేదా శారీరక ఒత్తిడికి గురికాకూడదు.
చంద్రగ్రహణం సూతకం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. గ్రహణ కాలంలో తులసి మొక్కను తాకకూడదు. సూతకం వేసే ముందు తులసి ఆకులను తీయండి. సూతకం లేదా గ్రహణం సమయంలో ఏదైనా తినడం, త్రాగడం మానుకోవాలి. ఈ సమయంలో ఎలాంటి ప్రయాణాలు చేయడం మానుకోండి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గ్రహణం, సూతకాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణ సమయంలో నిద్రించడం నిషిద్ధం.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం