ఆధ్యాత్మిక నగరంలో అదే భయం.. తిరుమలకు ఆగని థ్రెట్ మెయిల్స్ తో అలజడి.. అంతటా అప్రమత్తం.

ఆగని బెదిరింపు మెయిల్స్ తో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆందోళన. ఎయిర్ పోర్ట్ తో బాంబు బెదిరింపు మెయిల్స్ పరంపర హోటల్స్ కు ఆలయాలకు వస్తుండడంతో అలజడి నెలకొంది. వరుస బెదిరింపు మెయిల్స్ పోలీసు యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వస్తున్న మెయిల్స్ IP అడ్రస్ లను VPN టెక్నాలజీతో కనుగొనలేక పోతున్న సైబర్ ఎక్స్ పర్ట్స్స్ నానా తంటాలు పడుతున్న పరిస్థితి నెలకొంది.

ఆధ్యాత్మిక నగరంలో అదే భయం.. తిరుమలకు ఆగని థ్రెట్ మెయిల్స్ తో అలజడి.. అంతటా అప్రమత్తం.
Tirupati On High Alert

Edited By: Surya Kala

Updated on: Oct 07, 2025 | 10:15 AM

గత కొంత కాలంగా ఫేక్ మెయిల్స్ అలెర్ట్స్ తో వెంకన్న భక్తులు యాత్రికుల్లో ఆందోళన నెలకొంది. భయపడొద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసు యంత్రాంగం టెంపుల్ సిటీ తిరుపతిలో అలెర్ట్ గా ఉంది. అంతేకాదు ఈ వరసగా వస్తున్న మెయిల్స్ పోలీసులకు సవాలు గా మారాయి. అవును టెంపుల్ సిటీ తిరుపతికి గత ఏడాదిగా వస్తున్న బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు. దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆందోళన నెలకొంది. గత ఏడాదిగా వరుస వస్తున్న బెదిరింపులతో పోలీసు యంత్రాంగం కూడా హడలిపోతుంది. గతేడాది అక్టోబర్ 24, 28 వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ రాగా డిసెంబర్ 9న కపిలతీర్థం రోడ్ లోని రాజ్ పార్క్ హోటల్ కు మెయిల్ వార్నింగ్ వచ్చింది.

ఈ ఏడాది ఫిబ్రవరి లోనూ ఇస్కాన్ ఆలయానికి, పలు హోటల్స్ కు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ ఆందోళనకు గురి చేయగా సింధూర్ ఆపరేషన్ సమయంలో తిరుమలలో ఒక కుటుంబాన్ని బాంబు వేసి పేల్చి వేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ మేరకు అలిపిరి పిఎస్ లో కేసు కూడా నమోదయింది. ఇక ఈ నెల 3, 6 న తిరిగి వరుసగా పాక్, ఐసిస్ ల పేరుతో బాంబు మెయిల్స్ రాగా ఆగని మెయిల్స్ తో టెంపుల్ సిటీ లో టెన్షన్ వాతావరణం ఉంది.

ఎయిర్పోర్ట్ తో మొదలైన బాంబు బెదిరింపు మెయిల్స్ హోటల్స్ కు, ఆలయాలకు వస్తుండడంతో అలజడి నెలకొంది. గతంలో ఎక్స్ అకౌంట్ నుంచి ఎయిర్పోర్ట్ కు బెదిరింపు రాగా ఆ తర్వాత పలు హోటల్స్ బ్లాస్ట్ చేస్తామంటూ ఇమెయిల్స్ వచ్చాయి. టెంపుల్స్ కు సైతం అదే తరహా థ్రెట్ మెయిల్స్ ఇప్పటికే వచ్చాయి. దీంతో పోలీసు యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. థ్రెట్ మెయిల్స్ సీన్ రిపీట్ అవుతుండడంతో టెంపుల్ సిటీ లో టెన్షన్ నెలకొంది. అసలు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏఏ అకౌంట్స్ నుంచి పోస్టు చేస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్న పోలీసులు ఐడి లేంటి, ఐపి అడ్రస్సులెక్కడ అన్న దానిపై సైబర్ టీం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

అలర్టుగా ఉన్న పోలీసు యంత్రాంగం థ్రెట్ మెయిల్స్ తో అణువణువు తనిఖీలు నిర్వహిస్తోంది. యాత్రికులు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో బీడీ టీమ్స్ తో తనిఖీలు కొనసాగిస్తోంది. నిఘా కట్టుదిట్టం చేసింది. అయితే ఇప్పటివరకు ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకక పోయినా పోలీసు యంత్రాంగం మాత్రం అప్రమత్తంగానే ఉంటోంది. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ టెక్నాలజీని వినియోగించి సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న నేరగాళ్ల ను గుర్తించడం పోలీసులకు కూడా సవాలుగా మారిపోయింది. IP అడ్రస్ లను కనుగొనలేక పోతున్న సైబర్ ఎక్స్ పర్ట్స్స్ శ్రమ వృధా అవుతుంది. ఫేక్ మెయిల్స్ గా తేల్చుతున్న పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చేస్తున్న తనిఖీలతో భక్తులు యాత్రికులతోపాటు స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

మరోవైపు తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందని ఎప్పటినుంచో ఉన్న ఐబి హెచ్చరికలను కూడా పరిగణలోకి తీసుకుని జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నా మరోవైపు ఎన్ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు నిఘా సంస్థలు కూడా టెంపుల్ సిటీ తిరుపతికి వస్తున్న థ్రెట్ మెయిల్స్ పై ఆరా తీస్తున్నాయి. అయితే తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం భక్తులకు భద్రతపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. హోటల్స్ కు వరుసగా థ్రెట్ మెయిల్స్ వస్తున్నాయని అంగీకరిస్తున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నామన్న సంకేతం ఇస్తోంది. ప్రతి థ్రెట్ మెయిల్ ను సీరియస్ గా తీసుకొని తనిఖీలు చేస్తున్న పోలీసు
టీమ్స్ సైబర్ టెక్నాలజీ ద్వారా మెయిల్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మెయిల్స్ ఎక్కడి నుంచి ఎవరు చేస్తున్నారో ఖచ్చితంగా కనిపిడతామన్న కాన్ఫిడెంట్ గా ఉంది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..