మార్గశిర మాసం హేమంత ఋతువులో మెదటినెల. సారమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. మార్గశిర మాసం విష్ణువుకి అత్యంత ఇష్టమైన నెల. అంతేకాదు శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని ఏకాదశికి భువిపైకి వచ్చిన రోజుని వైకుంఠ ఏకాదశి అని అంటారు. అంతేకాదు ఈ రోజున విష్ణువు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చాడనీ, అందుకే ఈ పండుగ ‘ముక్కోటి ఏకాదశి’ .. ఏడాదిలో వచ్చే ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి పర్వం సుఖసంతోషాలను అందించే పర్వంగా భక్తులు భావిస్తారు. అత్యంత ఘనంగా జరుపుకుంటారు. తెలుగు వారు ఈ పండుగను ‘ముక్కోటి ఏకాదశి’ గా పిలుస్తారు. తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు.
ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి జనవరి 2వ తేదీన వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల ఆన్ లైన్ కోటాను డిసెంబరు 24న ఉదయం 9:00 AM గంటలకు టిటిడి విడుదల చేయనుంది.
రోజుకు 25,000 వేల చోప్పున 10 రోజులకు గాను 2.50 లక్షల టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా టిక్కెట్లను బుక్చేసుకోవలసినదిగా టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఈ రోజు ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేసింది. రోజుకు 2000 టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టిక్కెట్ కొనుగోలు చేశారు. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుండి మాత్రమే) ఇవ్వనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..