Srivari Brahmotsavas: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహ్మోత్సవ రోజుల్లో ఆ సిఫార్సు లేఖలు స్వీకరించం.. స్పష్టం చేసిన టీటీడీ ఛైర్మన్

|

Sep 23, 2022 | 6:12 PM

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 27న సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. సీఎం జగన్ అనంతరం పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారని తెలిపారు.

Srivari Brahmotsavas: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహ్మోత్సవ రోజుల్లో ఆ సిఫార్సు లేఖలు స్వీకరించం.. స్పష్టం చేసిన టీటీడీ ఛైర్మన్
Srivari Annual Brahmotsavam
Follow us on

Srivari Brahmotsavas: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో రెండేళ్ల తర్వాత భ‌క్తుల స‌మ‌క్షంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 26వ సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు.  27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు శ్రీవారి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 27న సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. సీఎం జగన్ అనంతరం పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారని తెలిపారు సుబ్బారెడ్డి. 28న ఉదయం నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించనున్నారని సుబ్బారెడ్డి చెప్పారు. అలిపిరి నుండి పది ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జగన్ ప్రారంభిస్తారు.

అయితే ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. అందుకే బ్రహ్మోత్సవ రోజుల్లో ఎవ్వరికీ రిఫెరల్ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు.. తెచ్చే  ప్రజాప్రతినిధులు, బోర్డు మెంబర్ల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

తరగొండ అన్నప్రసాద భవనంలో సుబ్బారెడ్డి తనిఖీలు చేశారు. భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదాలపై భక్తులందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అన్న ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు సుబ్బారెడ్డి. దర్శనం త్వరితగతిన చేయించేందుకు చర్యలు తీసుకంంటున్నామని పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..