Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్ దర్శనానికి 9 గంటల సమయం.. వృద్ధులు, దివ్యాంగుల ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్లు రిలీజ్

|

May 25, 2022 | 4:04 PM

స్వామివారిని స్పెషల్ కోటాలో దర్శించుకునే వయో వృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి దర్శనవేళల్లో మార్పులు ఉండనున్నట్లు సూచించింది.

Tirumala:  శ్రీవారి భక్తులకు అలెర్ట్ దర్శనానికి 9 గంటల సమయం.. వృద్ధులు, దివ్యాంగుల ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్లు రిలీజ్
Ttd Temple
Follow us on

Tirumala: తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీ వేంకటేశ్శరస్వామిని (Sri Venkateswara Swami) దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక టోకెన్లను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే స్వామివారిని స్పెషల్ కోటాలో దర్శించుకునే వయో వృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి దర్శనవేళల్లో మార్పులు ఉండనున్నట్లు సూచించింది.

ఇప్పటి వరకూ వయో వృద్ధులు, దివ్యాంగులు స్వామివారిని  ఉదయం 10 గంటలకు దర్శించుకునేవారు. అయితే జూన్ 1 నుంచి మాత్రం ఈ స్పెషల్ దర్శనంగా స్వామివారిని మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్‌లో దర్శించుకునే వీలుని కల్పించనున్నది. దర్శన వేళల్లో మార్పులను భక్తులు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కాగా..  రేపు ఆగస్టు నెల గదుల కోటాను ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.

మరోవైపు తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు ఎదురుచూస్తున్నారు. కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 9గంటల సమయం పడుతోంది.  ప్రస్తుతం భ‌క్తుల రాక పెరుగుతుండ‌డంతో టీటీడీ అధికారులు భక్తుల కోసం చర్యలు తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి