Tirumala Hundi Collection: కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే తిరుమలకు పెరుగుతున్న భక్తులు.. పెరిగిన స్వామివారి ఆదాయం

|

Feb 05, 2021 | 10:59 AM

కరోనా వైరస్ ప్రభావం మనుషులపైనే కాదు.. దేవాలయాలపైన కూడా పడింది. అయితే ఇప్పుడిప్పుడే దేవాలయాల్లో రద్దీ కనిపిస్తోంది. తాజాగా కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం పెరిగింది...

Tirumala Hundi Collection: కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే తిరుమలకు పెరుగుతున్న భక్తులు.. పెరిగిన స్వామివారి ఆదాయం
Follow us on

Tirumala Hundi Collection: కరోనా వైరస్ ప్రభావం మనుషులపైనే కాదు.. దేవాలయాలపైన కూడా పడింది.  అయితే ఇప్పుడిప్పుడే దేవాలయాల్లో రద్దీ కనిపిస్తోంది. తాజాగా కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 46,928 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది. అలిపిరి వద్ద నిత్యం భక్తులకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు.

తిరుమల శ్రీవారికి మళ్లీ భారీ ఆదాయం వచ్చింది. గురువారం భక్తుల రద్దీ కొనసాగగా.. స్వామివారిని 46,928 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 21,159 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.15 కోట్లు ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది. లాక్ డౌన్ అనంతరం మళ్లీ చాలా రోజులకు శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది. తిరుమలలో 11న పురంధరదాసు ఆరాధనోత్సవాలు.. 19న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.

కరోనా ప్రభావంతో స్వామివారి హుండీ ఆదాయం బాగా తగ్గిపోయింది. కరోనా కట్టడి కావడంతో పాటూ పరిస్థితుల్లో మార్పు రావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. టీటీడీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనంతో పాటూ సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగింది.

Also Read:

తొలి టెస్ట్ సమరం.. 15 ఓవర్లకు ఇంగ్లాండ్ 37/0

పోలీస్ స్టేషన్ సమీపంలోని ఏటీఎంను తాళ్లతో కట్టి వాహనంలో ఎత్తుకెళ్లిన దొంగలు.. 25లక్షలు లూటీ