SBI ATM Mission Robbery:పోలీస్ స్టేషన్ సమీపంలోని ఏటీఎంను తాళ్లతో కట్టి వాహనంలో ఎత్తుకెళ్లిన దొంగలు.. 25లక్షలు లూటీ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. కంటికి కనిపించిన ఏటీఎం అన్నింటిని లూటీ చేసేందుకు ప్రయత్నించి ఏకంగా.. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఏటీఎంనే మాయం చేశారు. అర్థరాత్రి కలెక్టర్ చౌక్ లోని ఎస్బీఐ ఏటీఎంలో దుండగులు..

SBI ATM Mission Robbery:పోలీస్ స్టేషన్ సమీపంలోని ఏటీఎంను తాళ్లతో కట్టి వాహనంలో ఎత్తుకెళ్లిన దొంగలు.. 25లక్షలు లూటీ
cctv
Follow us
Surya Kala

|

Updated on: Feb 05, 2021 | 10:43 AM

SBI ATM Mission Robbery: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. కంటికి కనిపించిన ఏటీఎం అన్నింటిని లూటీ చేసేందుకు ప్రయత్నించి ఏకంగా.. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఏటీఎంనే మాయం చేశారు. అర్థరాత్రి కలెక్టర్ చౌక్ లోని ఎస్బీఐ ఏటీఎంలో దుండగులు ఏటిఎం చోరీకి పాల్పడ్డారు. టవేరా వాహనంలో వచ్చిన దుండగులు సినీ ఫక్కీలో చోరీకి యత్నించారు. ముందుగా దేవిచంద్ చౌక్ లోని ఏటిఎం ను దొంగలించేందుకు ప్రయత్నించారు. అక్కడ సైరన్ మోగడంతో.‌. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చింది. దీంతో దుండగులు అక్కడ నుంచి పరారై.. కలెక్టర్ చౌరస్తా 2 టౌన్ ప్రాంతంలో ప్రతక్షమయ్యారు. ఏటీఎం మెషిన్ నుంచి డబ్బులు తీసుకోవడం వీలుకాక.. ఎస్బీఐ ఏంటిఎం ను తాళ్లతో కట్టి వాహనంలో తీసుకెళ్లారు. ఆ పక్కనే ఉన్న మరో ఏటీఎం లోనూ చోరీకి విఫల యత్నం చేశారు.

వాహనంలో తీసుకెళ్లిన ఏటిఎం మిషన్ నుంచి నగదును దొంగలించిన దుండగులు మిషన్ ను నాగపూర్ వెళ్లే బై పాస్ ప్రాంతంలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకు విచారణ చేపట్టారు. ఏటిఎం లో దాదాపు 25 లక్షలకు నగదు ఉన్నట్లు సమాచారం. దొంగలు మహారాష్ట్ర వైపు వెళ్లడంతో యావత్మాల్ జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.

Also Read:

తొలి టెస్ట్ సమరం.. ఆచితూచి ఆడుతోన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..

సంబంధం లేని వ్యక్తి జెండా ఉపయోగించే అర్హత లేదు.. శశికళపై డీజీపీకి నేతల ఫిర్యాదు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!