వెంకన్నకు మళ్లీ రికార్డ్ స్థాయి ఆదాయం.. ఈ నెల 11న పురంధరదాసు ఆరాధనోత్సవాలు.. 19న రథసప్తమి వేడుకలు

|

Feb 05, 2021 | 7:54 PM

తిరుమల శ్రీవారికి మళ్లీ భారీ ఆదాయం వచ్చింది. గురువారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారిని 46,928 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

వెంకన్నకు మళ్లీ రికార్డ్ స్థాయి ఆదాయం.. ఈ నెల 11న పురంధరదాసు ఆరాధనోత్సవాలు.. 19న రథసప్తమి వేడుకలు
Tirumala News Today
Follow us on

Tirumala News:  తిరుమల శ్రీవారికి మళ్లీ భారీ ఆదాయం వచ్చింది. గురువారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారిని 46,928 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 21 వేల మందికి పైగా భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

కరోనా ప్రభావంతో స్వామివారి హుండీ ఆదాయం బాగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్-19 కట్టడి కావడంతో పాటూ పరిస్థితుల్లో మార్పు రావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.. అందుకు తగ్గట్లుగానే హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే..శ్రీవారి హుండీకి 3.15 కోట్లు ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. మళ్లీ చాలా రోజుల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని… టీటీడీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది. 300 ప్రత్యేక దర్శనంతో పాటూ సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగింది. ఇకపోతే, తిరుమలలో 11న పురంధరదాసు ఆరాధనోత్సవాలు.. 19న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.

Also Read:

ఆలయంలో తల వెంట్రుకలు దొంగతనం చేశారు.. అడ్డంగా దొరికిపోయారు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..?

AP Local Body Elections: ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు.. ఘాటు పదజాలంతో సూటి విమర్శలు