Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ సమయంలో టికెట్లు ఉంటేనే స్వామివారి దర్శనం..

|

Dec 15, 2023 | 9:45 PM

తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవాన్ని నాలుగు సార్లు చేస్తారు.  ఉగాది, ఆణివార ఆస్టానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాలలో ఈ సేవను జరుపుతారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీటితో గర్బాలయాన్ని శుద్ది చేస్తారు. ఈ నేపధ్యంలో టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ సమయంలో టికెట్లు ఉంటేనే స్వామివారి దర్శనం..
Follow us on

కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తిరుమల చేరుకుంటారు. ఆపద మొక్కుల వాడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే శ్రీవారి భక్తులకు అలెర్ట్..  టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ నెల 19 న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. ఇందులో భాగంగానే ఈనెల 23 నుంచి జనవరి 2 వరకు వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రొక్తంగా నిర్వహించనుంది టీటీడీ. 18న ఎటువంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని ప్రకటించింది.

కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే..

దేవతలు నివసించే గర్భగుడిని పవిత్రంగా ఉంచడం కోసం శుద్ధి చేయడాన్ని కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. ఆలయ పరిసరాన్ని, ప్రత్యేకించి గర్బాలయాన్ని పవిత్రంగా ఉంచడానికి ఈ ఉత్సవాన్ని జరుపుతారు. తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవాన్ని నాలుగు సార్లు చేస్తారు.  ఉగాది, ఆణివార ఆస్టానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాలలో ఈ సేవను జరుపుతారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీటితో గర్బాలయాన్ని శుద్ది చేస్తారు.

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు

ఇప్పటికే వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనం చేసుకోవచ్చు. ఈ మేరకు 10 రోజుల పాటు  వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. ఇప్పటికే శ్రీవారి దర్శనం కోసం 2.25 లక్షల రూ. 300 దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా రిలీజ్ చేసింది.

ఇవి కూడా చదవండి

తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా ఈ నెల 22 నుంచి ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకన్లు జారీ చేయనున్నారు. మొత్తం 4,23,500 టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనున్నామని  టీటీడీ ప్రకటించింది. దర్శనం టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే శీవారి దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించింది.

 మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..