Thursday Rituals: గురువారం ఈ పనులు చేశారో పేదరికంతో ఫ్రెండ్షిప్ చేయాలి వస్తుంది..

హిందూ మతంలో వారంలోని ప్రతి రోజు ఒకొక్క గ్రహంతో, దేవతతో ముడిపడి ఉంటుంది. గురువారం దేవగురు బృహస్పతి , శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది.గురువారం రోజున సరైన ప్రవర్తనతో నడుచుకుని, నియమాలను పాటిస్తే వారు జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి, ప్రతిష్టను పొందుతారని చెబుతారు. అయితే గురువారం కొన్ని తప్పులు చేస్తే అది ఇంటి ఆనందంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

Thursday Rituals: గురువారం ఈ పనులు చేశారో పేదరికంతో ఫ్రెండ్షిప్ చేయాలి వస్తుంది..
Thursday Puja Tips

Updated on: Oct 16, 2025 | 9:50 AM

గురువారం బృహస్పతి, శీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది. జ్యోతిషశాస్త్రంలో ఈ రోజు చాలా పవిత్రమైనది. ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున తీసుకునే చర్యలు ఒక వ్యక్తి జీవితం, అదృష్టం, ఆర్థిక పరిస్థితిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. కనుక మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు , విష్ణువు ఆశీస్సులు మీతో ఉండాలని మీరు కోరుకుంటే.. గురువారం నాడు కొన్ని తప్పులను నివారించాలి. ఈ తప్పులు బృహస్పతిని బలహీనపరుస్తాయి. మీ జీవితంలోకి పేదరికాన్ని తీసుకురాగలవు. గురువారం రోజున కొన్ని పనులు పోరాటున కూడా చేయవద్దు. అవి ఏమిటో తెలుసుకుందాం..

జుట్టు, గోర్లు లేదా గడ్డం కత్తిరించడం

జ్యోతిష విశ్వాసాల ప్రకారం గురువారం నాడు జుట్టు, గోర్లు లేదా గడ్డం కత్తిరించుకోవడం ఖచ్చితంగా నిషేధించబడింది. అలా చేయడం వల్ల జాతకంలో బృహస్పతి గ్రహం బలహీనపడుతుందని, పిల్లల ఆనందం, దీర్ఘాయువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఇది గణనీయమైన ఆర్థిక నష్టానికి కూడా దారితీస్తుంది.

బట్టలు ఉటడం, ఇంటిని శుభ్రపరచడం

గురువారం నాడు అధికంగా శుభ్రపరచడం, చెత్త లేదా సాలెపురుగులను తొలగించడం,ఇంటిని కడగడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఈ రోజున ఇంటిని శుభ్రం చేయడం, ముఖ్యంగా తుడుచుకోవడం, లక్ష్మీ దేవతను దూరం చేస్తుంది. బృహస్పతి స్థానాన్ని బలహీనపరుస్తుంది. ఇంకా మహిళలు ఈ రోజున తలంటుకోవద్దు. ఎందుకంటే ఇది వారి వివాహ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

డబ్బు లావాదేవీలు

గురువారం రోజున ఎటువంటి ఆర్థిక లావాదేవీలు (అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం) చేయకూడదు. అలా చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలహీనపడుతుందని నమ్ముతారు. డబ్బు అప్పుగా ఇవ్వడం వల్ల దాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది. రుణాలు తీసుకోవడం మీ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

అరటిపండ్లు తినొద్దు

గురువారం నాడు అరటిపండ్లు తినడం నిషిద్ధం. మత విశ్వాసాల ప్రకారం విష్ణువు అరటి చెట్టులో నివసిస్తాడు. ఈ రోజున అరటి చెట్టును పూజిస్తారు. కనుక ఈ పూజా రోజున అరటిపండ్లను తినవద్దు. అయితే అరటిపండ్లను శ్రీ మహా విష్ణువు కి సమర్పించవచ్చు.

తామసిక ఆహారం తినడం

గురువారం నాడు మాంసం, మద్యం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామస ఆహారాలను తినకూడదు. ఈ రోజు ఆధ్యాత్మికత, మతపరమైన ఆచారాలకు అంకితం చేయబడింది. తామస ఆహారాలు తీసుకోవడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి కోపంగా ఉంటారు. ఇది ఇంటి ఆనందం,శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది.

పెద్దలను అవమానించడం

గురువారం నాడు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను లేదా ఇతర పెద్దలను ఎప్పుడూ అవమానించవద్దు. బృహస్పతి జ్ఞానం , గౌరవానికి కారకుడు. వారిని అగౌరవపరచడం బృహస్పతికి కోపం తెప్పిస్తుంది. ఇది ప్రాణాంతక ఇబ్బందులు, వృత్తిపరమైన అడ్డంకులకు దారితీస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు