కొత్త సంవత్సరంలో ప్రేమ వివాహాలు ఏ రాశుల వారికి ఫలిస్తాయి, ఏ రాశుల వారికి ఇబ్బందులు కలిగిస్తాయి అనేది ఇక్కడ చర్చిద్దాం. జాతక చక్రాన్ని బట్టి ప్రేమ వివాహాలను, ప్రేమ వ్యవహారాలను అంచనా వేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత గ్రహాల స్థితిగతులను బట్టి కూడా అంచనా వేయవచ్చు. 2023 జనవరి 18 నుంచి డిసెంబర్ 31 వరకు గ్రహాల సంచారాన్ని బట్టి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఫలితాలను చెప్పాల్సి ఉంది. కొత్త సంవత్సరంలో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారబోతున్నాయి. ప్రేమ వ్యవహారాల మీద ఈ గ్రహాల ప్రభావం తప్పకుండా ఉంటుంది. జనవరి 18న శని కుంభరాశిలోకి మారబోతున్నాడు. ఏప్రిల్ 23న గురువు మేష రాశిలోకి మారుతున్నాడు. అక్టోబర్ 23 వరకు రాహువు మేష రాశిలో ఉండి ఆ తరువాత మీన రాశిలోకి మారుతాడు. అదేవిధంగా కేతువు కూడా అక్టోబర్ 23న తులారాశి నుంచి కన్యా రాశిలోకి మారుతాడు. ఏప్రిల్ 23 నుంచి అక్టోబర్ 23 వరకు మేష రాశిలో గురు రాహువులు కలిసి ఉండటం జరుగుతుంది. ఈ కలయిక వల్ల ప్రేమ, వివాహ, కుటుంబ, దాంపత్య వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
యువతీ యువకుల మధ్య ప్రేమ అంకురించడానికి ప్రధాన కారకుడు శుక్రగ్రహం. సాంప్రదాయ వివాహాలకు గురువు కారకుడు. శని, రాహు కేతువులు, కుజుడు సాంప్రదాయ వివాహాలకు, సమాజం అంగీకరించిన ప్రేమలకు పూర్తిగా విరుద్ధం. జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్న పక్షంలో ప్రేమ వివాహాలు జరగటానికి ఆస్కారం ఉంటుంది. గురు గ్రహం బలంగా ఉన్న పక్షంలో పెద్దల అనుమతితో, సాంప్రదాయబద్ధంగా వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. కుజుడు, శని, రాహు కేతువులు బలంగా ఉన్నట్లయితే కులాంతర, వర్ణాంతర, మతాంతర, సాంప్రదాయ విరుద్ధ వివాహాలకు, ప్రేమలకు అవకాశం ఉంటుంది.
శుక్ర గ్రహంతో కానీ, గురు గ్రహంతో కానీ శని కలిసినా, రాహు కేతువులు కలిసినా, కుజ గ్రహం కలిసినా ఇంటి నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకోవడం లేదా పెద్దల అంగీకారంతో సంబంధం లేకుండా వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా కులాంతర వివాహాలకే అవకాశం ఉంటుంది. కొత్త సంవత్సరం మిధునం, సింహం, ధనస్సు, మీనరాశుల వారికి ప్రేమ వ్యవహారాలు కొద్దిగా విజయం సాధించే అవకాశం ఉంది. మిగిలిన రాశుల వారు ప్రేమల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది.
కొత్త సంవత్సరంలో ఈ నాలుగు రాశులలో ఎవరైనా కొత్తగా ప్రేమ వ్యవహారాల్లో ప్రవేశిస్తున్నట్లయితే కుటుంబ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రేమ జీవితం ఆశించినంతగా సాఫీగా ముందుకు వెళ్ళదు. సాధారణంగా వర్ణాంతర, కులాంతర, మతాంతర ప్రేమలు, వివాహాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్లకుండానే మధ్యలోనే ఆగిపోయే సూచనలున్నాయి. అందువల్ల ఈ రాశుల వారు ప్రేమలో పడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఒకవేళ చాలా కాలంగా ప్రేమలో ఉన్న పక్షంలో పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేయటం మంచిది. తప్పనిసరిగా పెళ్లి చేసుకునే పక్షంలో కుటుంబంలో కలతలు తలెత్తే అవకాశం ఉంది.
ఈ నాలుగు రాశుల్లో ఏ రాశి వారు ప్రేమలో పడినా అది సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ప్రేమ మీద విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. పెద్దల జోక్యంతో ప్రేయసి ప్రియులు ఎడబాటుకు గురికావాల్సి వస్తుంది. ఇందులో వృశ్చిక, కుంభరాశులకు లైంగిక సంబంధాలకు, ముద్దు మురిపాలకు కూడా అవకాశం ఉండకపోవచ్చు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వారు సైతం చిన్నాచితకా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. కొంచెం నిగ్రహంతో, నియంత్రణతో ఉంటే ఆ తరువాత సంవత్సరం పరిస్థితి కొద్దిగా మెరుగుపడవచ్చు. అందువల్ల ప్రేమ జీవితాన్ని మరొక సంవత్సరం కొనసాగించడమే మంచిది.
కొత్త సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారి ప్రేమలు బాగా పురోగతి చెందుతాయి కానీ, పెళ్లికి దారి తీయకపోవచ్చు. చాలా కాలంగా ప్రేమలో ఉన్నవారికి సమయం బాగానే ఉంది. కాగా, ఈ రాశుల వారు సాధారణంగా ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం గాని, సహజీవనం చేయటం కానీ జరుగుతుంది. పెద్దలకు ఏమాత్రం అంగీకారం లేని ప్రేమలు చోటు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అంతేకాదు, ప్రేమ వ్యవహారాలు యువతులకు అంతగా అనుకూలించకపోవచ్చు. యువతులకు తమ కుటుంబాన్ని నుంచి వ్యతిరేకత ఎదురు కావచ్చు. ఒకవేళ పెళ్లి జరిగినా అనుకున్నదొక్కటి అయ్యేది ఒక్కటి అన్నట్టుగా ఉంటుంది. ప్రేమల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది.