Natural Three Laws: ప్రకృతిని అర్ధం చేసుకుని… పెద్దలు చెప్పిన మూడు నియమాలు..అవి పాటిస్తే..జీవితం సంతోషమయం..

|

Sep 03, 2021 | 9:08 AM

Natural Three Laws:హిందూ ధర్మంలో ప్రకృతికి విశిష్ట స్థానం ఉంది. ప్రకృతి సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశం. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే..

Natural Three Laws: ప్రకృతిని అర్ధం చేసుకుని... పెద్దలు చెప్పిన మూడు నియమాలు..అవి పాటిస్తే..జీవితం సంతోషమయం..
Nature Of Laws
Follow us on

Natural Three Laws:హిందూ ధర్మంలో ప్రకృతికి విశిష్ట స్థానం ఉంది. ప్రకృతి సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశం. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం.. మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచమే ప్రకృతి. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతలో కూడా ప్రకృతి గురించి చెప్పారు. “ప్రాథమిక స్వయంచాలిత శక్తి” ప్రకృతి అని వర్ణించబడింది. సృష్టికి ప్రకృతియే మూలం. సృష్టి చర్యల్లో ప్రకృతి పాత్ర అత్యంత కీలకమైంది. ప్రధానమైంది. కనుక ప్రకృతిలో ఉన్న మూడు గుణాలైన రజో – సృష్టికి.. సాత్త్విక – స్థితికి.. తమో – లయకి… నియమాలను అనుసరిస్తూ.. జీవితం సాగిస్తే.. సుఖవంతంగా సాగుతుంది. ప్రకృతి లోని వాస్తవాలు.. ఇది పాటించడం కొంచెం కష్టమైనా.. ఎందుకు పాటించాలో కొన్ని నియమాలను ఏర్పరచారు పెద్దలు.. అవి ఏమిటో తెలుసుకుందాం..

ప్రకృతి .. మొదటి నియమం: పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డి, కలుపుతో నింపేస్తుంది. అదేవిధంగా మన మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడుఆలోచనలు చేరుకుంటాయి.

ప్రకృతి.. రెండవ నియమం: ఎవరివద్ద ఏమిఉంటుందో వారు దానినే పంచుకోగలరు. సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు. దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు. జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు. భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు. భయస్తులు భయాన్నే పంచగలరు.

ప్రకృతి.. మూడవ నియమం: మన జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి. ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది. మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి. ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది. నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది. అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది. దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది. సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది.

ప్రకృతిని.. ఈ మూడు నియమాలను అర్ధం చేసుకుని నడుచుకునే మనిషి జీవితం సుఖవంతంగా సంతోషంగా సాగిపోతుందని పెద్దల మాట.

Also Read: ఈ 3 విషయాలను ఖచ్చితంగా గుర్తించుకోండి.. లేదంటే జీవితం నాశనమైనట్లే!

 వాస్తు ప్రకారం.. ఇంటి ముంగిట ఈ 9 చెట్లను నాటితే ధన ప్రాప్తి కలుగుతుంది..!