Tirumala Prasadam: మహాప్రసాదం మారింది.. లడ్డూతోపాటు శ్రీవారి అన్న ప్రసాదాల రుచి మారింది..!

తిరుమల లడ్డు మారింది. నెయ్యిలో నాణ్యత లడ్డుతో పాటు శ్రీవారి అన్న ప్రసాదాల రుచిని మార్చింది. నెయ్యి కల్తీతో లడ్డు ప్రసాదం అపవిత్రం అయిందన్న దుమారం భక్తుల్లో ఆందోళనకు గురి చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలెర్ట్ అయ్యింది. శ్రీవారి మహా ప్రసాదంలో క్వాలిటీని పెంచింది.

Tirumala Prasadam: మహాప్రసాదం మారింది.. లడ్డూతోపాటు శ్రీవారి అన్న ప్రసాదాల రుచి మారింది..!
Titumala Laddu

Edited By:

Updated on: Sep 25, 2024 | 8:11 PM

తిరుమల లడ్డు మారింది. నెయ్యిలో నాణ్యత లడ్డుతో పాటు శ్రీవారి అన్న ప్రసాదాల రుచిని మార్చింది. నెయ్యి కల్తీతో లడ్డు ప్రసాదం అపవిత్రం అయిందన్న దుమారం భక్తుల్లో ఆందోళనకు గురి చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలెర్ట్ అయ్యింది. శ్రీవారి మహా ప్రసాదంలో క్వాలిటీని పెంచింది. వెంకన్న ప్రసాదం మహా అద్భుతంగా ఉందన్న సంతృప్తిని కలిగించింది. లడ్డూ రుచి ఎంతో మాధుర్యం.. తిరుమల లడ్డు.. మహా ప్రసాదంగా కోట్లాది మంది భక్తులు స్వీకరించే లడ్డూ రుచి ఎంతో మాధుర్యం. 310 ఏళ్లు నిండిన ఆ లడ్డు మాధుర్యం ఈ మధ్య కల్తీ నెయ్యితో రుచితప్పిందన్న భావన భక్తుల్లో బలంగా వినిపించింది. అమృత పదార్ధంగా భక్తిరస మాధుర్యాన్ని పంచుతున్న తిరుమల వెంకన్న లడ్డూ లోని నెయ్యి కల్తీ వ్యవహరమే ఇందుకు కారణం అయ్యింది. తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేకపోవడానికి నెయ్యి నే కారణమని తేలింది. దీంతో నెయ్యి నాణ్యతను పెంచడం ద్వారా మహా ప్రసాదంలో క్వాలిటీ తీసుకురావాలని టీటీడీ భావించింది. ఈ చర్యనే కాంట్రవర్సీ కారణం అయ్యింది. అత్యంత ప్రీతి పాత్రమైన లడ్డు ప్రసాదం వెంకన్న భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన లడ్డు ప్రసాదం నాణ్యత పై భక్తుల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో అంతే ప్రాధాన్యత ఇస్తున్న శ్రీవారి లడ్డు ప్రసాదం మహా ప్రసాదంగా భక్తులు భావించేలా చర్యలు చేపట్టింది. లడ్డు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి