TTD: తిరుమలకు వెళ్లే వారికి టీటీడీ అలర్ట్.. అలా చేస్తేనే శ్రీవారి దర్శనానికి రావాలని షరతు

|

Aug 15, 2022 | 7:20 AM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వరస సెలవుల కారణంగా కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ కాంప్లైక్స్ ...

TTD: తిరుమలకు వెళ్లే వారికి టీటీడీ అలర్ట్.. అలా చేస్తేనే శ్రీవారి దర్శనానికి రావాలని షరతు
Tirumala Devotees Rush
Follow us on

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వరస సెలవుల కారణంగా కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ కాంప్లైక్స్  లోని 31 కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. వీరికి సర్వదర్శనం కల్పించేందుకు 40 గంటలు సమయం పడుతోందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం వరకు 60వేల మంది భక్తులు తిరమలేశుడిని దర్శించుకున్నారు. క్యూలైన్లు నిండిపోవడం, వెలుపల కిలోమీటర్ల కొద్దీ బారులు తీరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. తిరుమలలో ఎటు చూసినా రద్దీనే కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు, దేవస్థానం బస్సులు కిటకిటలాడాయి. విపరీతంగా పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా వసతి సౌకర్యం కొరవడింది. తిరుపతిలో వసతి ఉన్న భక్తులే తిరుమలకు రావాలని అధికారులు కోరుతున్నారు. కాగా.. ఈ నెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వై.వీ. సుబ్బారెడ్డి వెల్లడించారు.

తిరుమలలో పెరిగిపోయిన భక్తుల రద్దీ నేపథ్యంలో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 20 వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ నిర్ణయించింది. వీఐపీ బ్రేక్‌, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుమల యాత్ర ఏర్పాట్లు చేసుకోవాలని, ముందస్తు ప్లాన్ లేకుండా తిరుమల వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించింది. అంతే కాకుండా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, సిఫారసు లేఖలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి