AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simhadri Appanna Temple: సింహాచలం ఆలయంలో ప్రొటోకాల్‌ వివాదం.. ఆలయ అధికారులపై వెల్లువలా ఫిర్యాదులు

సింహాచలం అప్పన్న ఆలయంలో ప్రోటోకాల్‌ పంచాయతీకి తెరపడేలాలేదు. ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి.

Simhadri Appanna Temple: సింహాచలం ఆలయంలో ప్రొటోకాల్‌ వివాదం.. ఆలయ అధికారులపై వెల్లువలా ఫిర్యాదులు
Simhachalam
Sanjay Kasula
|

Updated on: May 09, 2022 | 6:23 AM

Share

సింహాద్రి అప్పన్న ఆలయంలో నిర్వహించిన చందనోత్సవంలో ప్రొటోకాల్‌ వివాదం చెలరేగింది. ప్రొటోకాల్‌ పాటించడంలో ఆలయ అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిజరూప దర్శనానికి వచ్చిన వీఐపీలకు ప్రొటోకాల్‌ పాటించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రొటోకాల్‌పై సుప్రీం జస్టిస్‌ సీఎం ఆఫీస్‌కు ఫిర్యాదు చేయడం ఆలయ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. స్వామి దర్శనానికి సరైన ఏర్పాట్లు చేయలేదని ఆయన సీఎం కార్యాలయ అధికారులకు మౌఖిక ఫిర్యాదు చేశారు. జస్టిస్‌ ఫిర్యాదుపై స్పందించిన సీఎంవో అధికారులు కలెక్టర్‌ మల్లికార్జునను వివరణ కోరారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఆయన ఆలయ ఈవో సూర్యకళ, చీఫ్‌ ప్రొటోకాల్‌ అధికారిగా వ్యవహరించిన భీమిలి ఆర్డీవో భాస్కర్‌రెడ్డిని వివరణ కోరారు. జస్టిస్‌ ఆలయదర్శనానికి వచ్చిన సమయంలో సాధారణ భక్తులు ఒక్కసారిగా చొచ్చుకొచ్చారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆలయ ఈవో, ఆర్డీవో. నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోకి పాలకమండలి సభ్యుడు ప్రవేశించడంపైనా దేవాదాయశాఖ సీరియస్‌ అయ్యింది. మరోసారి ఇలాంటి పొరబాట్లు రిపీట్‌ కావొద్దని గట్టిగా మందలించింది. ప్రొటోకాల్‌ విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆలయ అధికారులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: Taj Mahal: తాజ్‌మహల్‌లోని ఆ గదులను తెరవండి.. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్..

ఇవి కూడా చదవండి

Kitchen Tips: టేస్టీ టేస్టీ పాస్తా కట్‌లెట్.. మీ ఇంట్లోని చిన్నారులకు అదిరిపోయే టిఫిన్ ఇలా చేయండి..