Pawan Kalyan Rajahmundry Tour: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడి పుట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలు, జనసేనాని పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ కదిలింది. రోడ్లపై గుంతలను శ్రమదానంతో కొంతమేర బాగుచేయడానికి జనసేన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమంలో జనసేనాని కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన నేపథ్యంలో టెన్షన్ నెలకొంది. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అధ్వాన్నంగా ఉన్న రాజమండ్రి హుక్కుంపేట బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహించి శ్రమదానం చేసేందుకు సిద్ధమయ్యారు జనసేనాని పవన్ కల్యాణ్..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతిలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నేడు పవన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపైన పవన్ బహిరంగ సభ జరగాల్సి ఉంది. అయితే పోలీసులు పవన్ సభను అనుమతి నిరాకరణతో బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఇదే హుక్కంపేట-బాలాజీపేట రోడ్డులో పవన్ శ్రమధానం చేస్తాని ప్రకటించారు జనసేన నేతలు. ఇప్పటికే అధికారులు ఆ గుంతలను పూడ్చివేశారు.
అయితే, ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ రాజమండ్రి టూర్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. బహిరంగ సభ నిర్వహించేందుకు వీల్లేదని రాజమండ్రి అడిషనల్ ఎస్పీ లతా మాధురి స్పష్టం చేశారు.. కానీ, మరోవైపు.. జనసేన పార్టీ శ్రేణులు మాత్రం ఏర్పాట్లలో మునిగిపోయారు. ఓ వైపు పవన్ కళ్యాణ్ టూర్ పై పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వకపోవడం.. పవన్ టూర్ పై వైసీపీ మంత్రులు, నేతలు మండిపడం .. మరోవైపు జనసేన కార్యకర్తలు ఏర్పట్లు చేస్తుండడంతో ఎం జరగనుంది అనే టెన్షన్ నెలకొంది. సర్కార్‌కు పవన్‌కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన నేతలు భావిస్తున్నారు.
Also Read: నేడు సొంత ఊరుకు సీఎం జగన్ పయనం.. కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటన..